వినమరుగైన

ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లని మిక్కిలి స్వతంత్రించి మూలమునకు దూరముగా తొలగిపోలేదు. నన్నయది ప్రధానముగా అభ్యాసశైలి. అక్కడక్కడ నాటకీయ శైలి కూడా కలదు. వీనికితోడు వర్ణనలు ఆయన శైలిలో చోటుచేసుకున్నాయి. నన్నయ శైలికి వచ్చిన గాంభీర్యమంతయు బహుళ సంస్కృత పద ప్రయోగమువలన. ఆయనశైలి ఎంత తత్సమ పద భూయిష్టమైనను, అందు అర్ధ కాఠిన్యముగాని, శబ్ద పారుష్యముగాని ఉండవు. ఈ శబ్ద గాంభీర్యము వలన రచనకు ఉదాత్తతయు, ఠీవియు లభించినవి అని తన మనోభిప్రాయాన్ని వెల్లడించారు పింగళి.
నన్నయ తర్వాతది శైవకవుల యుగం. కుమార సంభవ కర్తయు, శైవకవులలో ప్రౌఢకవియునైన ననె్నచోడుని కవితా వైశిష్ట్యాన్ని విశే్లషిస్తూ ఆచార్య పింగళి, కావ్యము రసవంతముగా నుండవలెనన్నచో ప్రసన్నముగా నుండుటయేగాక ఔచిత్య బంధురముగా కూడా ఉండవలెను. ఈ ఔచిత్యమనునది శబ్దములో, అర్థములో, వస్తువులో, వర్ణనలో, భాషలో, సంవాదములో- అది యిది అననేల, శరీరమంతయు వ్యాపించి యుండెడి ఓజస్సువలె కావ్యమంతట నిండి యుండవలెను’’ అని విశదీకరించారు.
ఇక ననె్నచోడుని తర్వాత మల్లికార్జున పండితారాధ్యులు, నాచన సోమనవంటివారు అగ్రేసరులైన కవులు. చివరగా పాల్కురికి సోమనాధుని గురించి ‘కవిత్వమునకు భావావేశము జీవగఱ్ఱ. ఇతని కవిత్వమునకు అదియే పంచప్రాణ సారభూతమైయున్నది. మతమున కవితత్త్వావిష్టుడు గనుకను, కావ్యేతి వృత్తమంతయు శివతత్త్వ పరము గనుకను భావావేశ మతావేశములు ఒండొకటి తోడై పరస్పర పోషకములైనవి. ఏ కథ చెప్పినను శైవచిహ్నమును వర్ణించి భక్తి ప్రవాహమున ఓలలాడును. శివమెక్కిన గణాచారివలె గంతులువేయును. శాంతముగా గాని, చప్పగా గాని అతని నోట ఒక్కమాటయు వెలువడదు’’ అని లక్ష్మీకాంతంగారు అభిప్రాయపడ్డారు. తిక్కన యుగానికి కేంద్ర బిందువు మహాకవి తిక్కన. నిర్వచనోత్తర రామాయణంలో పేర్కొనబడ్డ తిక్కనగారి కవితా వైశిష్ట్యం గురించి వివరిస్తూ పింగళి ‘‘ఆయన కవితాశయమునకు జీవమని చెప్పదగిన శబ్దార్థౌచితి, సంభాషణా కౌశలము, సజీవపాత్ర సృష్టి, నిశిత ప్రకృతి పరిశీలనము, తీక్షణ మనోనిదానము, అల్పాక్షరములు అనల్పార్థ రచన మొదలగునవి అన్నియు భారతమునందువలె ఇందును వ్యక్తమగుచుండును’’ అని పేర్కొన్నారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

ధూర్జటి వేంకట బాలాజీ