వినమరుగైన

ఆరుయుగాల ఆంధ్రకవిత (ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒకరు ఊహించినట్టు ఊహించడు. ఇతని (ననె్నచోడుని) ప్రతిభ పాము పడగ విప్పినట్టు, చెట్టు నిలువునా పూచినట్టు, ఆకాశంలో హఠాత్తుగా హరివిల్లు పరిచినట్టు, ఆకాశగంగ వెల్లి వొడిచి మీదికురికినట్టు ఎక్కడ చదువు- దిగ్భ్రాంతి గొలుపుతుంది’’.
‘‘కొందరు వ్రాసినపుడే కవులు; కొందరు వ్రాస్తూన్నంతకాలం కవులు. మరి కొందరు వ్రాసినా, వ్రాయకపోయినా నిత్యం కవులే అనిపిస్తుంది. శ్రీనాథుడు మూడో కోవకు చెందినవాడు’’.
‘‘సత్యభామ వృక్షమైతే, పువ్వు రుక్మిణి. రుక్మిణి కృష్ణుడికి హృదయమైతే, సత్య శరీరం. కృష్ణ హృదయం రుక్మిణి వద్ద విశ్రమిస్తే సత్యభామ దగ్గర శరీరం సుఖిస్తుంది. ఈ కావ్యం రుక్మిణి దగ్గర పరిమళిస్తే సత్య దగ్గిర వృక్షమై నిలబడుతుంది’’.
ఈ కవితా కళాత్మక వ్యాసాలు ఆరు యుగాల ఆంధ్రకవిత అనే గ్రంథంలోనివి. దక్షారామ, కీర్తితోరణ కావ్య రచనలతో, సృష్టిలో తీయనిది స్నేహమేనోయి! అన్న గేయరచనతో, హనుమచ్ఛాస్ర్తీ కథలు, విజయదశమి కథలు- గౌతమీ గాథల రచనతో, శ్రీవేదమూర్తులు- కవి సన్మానం మున్నగు నాటికలతోపాటు, భాస నాటక శ్రవ్య రూప కాంధ్రీకరణలతో, ప్రథమంగా కథానికా నామధేయాన్ని తెలుగులో వ్యాప్తి చేయడంతోపాటు కాళిదాస కళామందిరం, సారమతి నన్నయ, భాషలో తమాషాలు మున్నగు విమర్శ వ్యాస గ్రంథ రచనలతో భిన్న సంస్కారాల చిత్ర సంపుటిగా ఆధునికాంధ్ర సాహిత్యలోకంలో నిలిచిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు దీని రచయిత.
1980లో కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ వారు ది ఆర్టిస్టిక్ వాల్యూస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఫ్రమ్ 1100 టు 1800 అనే పేరుతో వీరి చేత వ్రాయించిన గ్రంథమిది. 1986లో ఆంధ్ర సారస్వత పరిషత్తు- హైదరాబాదు వారిచే ఇది ముద్రితం.
అసలు, 20వ శతాబ్దంలో కాలాన్ని బట్టి, కవులను బట్టి, పోషించిన రాజులను బట్టి, చేపట్టిన సాహిత్య ప్రక్రియలను బట్టి యుగాలను విభజిస్తూ కవుల కాల నిర్ణయాలను, గ్రంథకర్తృత్వ నిర్ణయాలను శాసనాది సాక్ష్యాలతో గావిస్తూ, కవితా సమీక్షలతో కందుకూరి వీరేశలింగం, చాగంటి శేషయ్య కవిత్వవేది నారాయణరావు, ఆరుద్ర మున్నగువారు మైలురాళ్లవంటి సాహిత్య చరిత్ర గ్రంథాలు వ్రాశారు. కానీ యువసాహితీ పాఠకులకు, ప్రాచీనాంధ్ర సాహిత్య పరిచయంలేనివారికి శాసనాల వీరాసనాలతో తలనొప్పి కలిగించక, కేవల కవితాభిరుచి కలిగేలా, ఆ కావ్యాలను చదవాలనే కోరిక కలిగేలా, ఒక ఉగాదినాడు చేసిన అయిదు ప్రసంగాల్లో, ఎవరి ప్రవేశికలూ- పీఠికలూ నడిపించని ధోరణిలో, వాగ్దేవి ముఖం చూసి ఏ మూలుగులూ, మొహమాటాలు లేని పద్ధతిలో గాఢానుభూతితో వ్యక్తీకరిస్తున్నట్టుగా కవితా సమీక్షల్ని రుూ గ్రంథాల్లో ఇంతకుపూర్వం ఎవరూ చేయలేదు- ఒక ఇంద్రగంటివారు తప్ప.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామడుగు వెంకటేశ్వర శర్మ