వినమరుగైన

ఆరుయుగాల ఆంధ్రకవిత (ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువసాహితీ పాఠకులకు, ప్రాచీనాంధ్ర సాహిత్య పరిచయంలేనివారికి శాసనాల వీరాసనాలతో తలనొప్పి కలిగించక, కేవల కవితాభిరుచి కలిగేలా, ఆ కావ్యాలను చదవాలనే కోరిక కలిగేలా, ఒక ఉగాదినాడు చేసిన అయిదు ప్రసంగాల్లో, ఎవరి ప్రవేశికలూ- పీఠికలూ నడిపించని ధోరణిలో, వాగ్దేవి ముఖం చూసి ఏ మూలుగులూ, మొహమాటాలు లేని పద్ధతిలో గాఢానుభూతితో వ్యక్తీకరిస్తున్నట్టుగా కవితా సమీక్షల్ని రుూ గ్రంథాల్లో ఇంతకుపూర్వం ఎవరూ చేయలేదు- ఒక ఇంద్రగంటివారు తప్ప.
ఆంధ్ర కవితా ప్రవృత్తి అంతా ఆయనకు ఆరు ఋతుశోభల్లా కనిపించింది. స్తబ్దంగా రాగి పట్టాలమీద, రాతి పలకలమీద దృశ్యా దృశ్యంగా పడి వున్న కవితా ప్రకృతికి చివురు తొడిగించి, పూలు పూయించినవాడు నన్నయ. ఆయన కవితా ప్రస్థానం ఇతిహాసంతో ప్రారంభమైంది. కనుక ఇంద్రగంటివారి దృష్టిలో అది ఇతిహాస వాసంతి. తరువాత 12వ శతాబ్దంలో శైవ కవుల కవితా ప్రభంజనం వీచింది. దేశి కవితకు పెద్దపీట లభించింది. వాక్కులో తీక్షణతా, భక్తిలో వీరం శివమెత్తి పరవళ్లు తొక్కాయి. కనుక అది శైవ గ్రీష్మం. 13వ శతాబ్దంలో అవ్యగ్రతను, ఉగ్రతను శాంతపరచి ఒక సత్పథం ఏర్పరచిన ఉభయ కవిమిత్రుడు తిక్కనార్యుని యుగం ఇంద్రగంటివారి దృక్పథంలో హరిహర వార్షుకం. ఆ వర్షా శోభలోనే 14, 15 శతాబ్దులలో ఆంధ్ర కవితాకాశాన అపూర్వ సౌందర్యంతో వెలిగినవారు ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన వగైరాలు పలువురు. కనుక అది కావ్యేంద్ర ధనువు. తరువాత 16వ శతాబ్దిలో రాయలప్రోదిలో ప్రబంధ శరత్తు ఉదయించింది. ఆ శరద్రాత్రులలో కవులు ఆడినదే ఆట- పాడినదే పాట- తదుపరి మంచు జల్లు మొదలైంది. అయినా ఆంధ్ర కవితా సరసిలో అక్కడక్కడా కవితా కల్హారాల పరిమళ లహరి విజయ విలాసం వంటి కావ్యాల రూపంలో విసరుతూనే ఉంది. అది కవితాహేమంతం. పిదప వచ్చింది రచనా శైశిరం. ప్రతిభ సన్నగిల్లి పైపై మెరుగులది పైచేయి అయింది. శృంగారం తన హద్దులు మరచిపోయింది.
అయినా, అందులోనూ శిఖరాయమాణులైన కవులున్నారంటూ కంకటి పాపరాజును పేర్కొన్నారు ఇంద్రగంటివారు. పెద్దన పేశల సుధోక్తి, రాయలవారి రాతిగోపురం, పింగళి కవి ఇంద్రజాలం, మూర్తి కవిభూషణ మార్గం, మొల్ల సువాసన ఇత్యాదిగా రుచికరమైన పేర్లు పెడుతూ భట్టారకుడు, నృసింహం, వీరభద్రం, విక్రమ చరిత్రం ఇత్యాదిగా పేర్లను సంక్షిప్తపరచి చెప్పేరూపంలో ఒక చనువును, ఆత్మీయతనూ వ్యక్తీకరిస్తూ ఉంటారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

రామడుగు వెంకటేశ్వర శర్మ