వినమరుగైన

శ్రీ శివభారతము -గడియారము వేంకట శేషశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద యేబది కావచ్చు. అన్నీ చెక్కు చెదరక వారి స్మృతిపథంలో వుంటాయి. శాస్ర్తీగారు కావ్యరచన చేసే పద్ధతి ఇది. ఇదే ధ్యానతత్పరుడి అనే పంక్తిలోని రహస్యం.
‘విశ్వశ్రేయః కావ్య’మన్నారు కదా. లోకానికి ఉపకరించేది.మేలు చేసేది కావ్యం. శాస్ర్తీగారు ఎన్నుకొన్న కథ శివ కథ. అంటే శివాజీ కథ. అది భారతం వంటిది. పేరులోనే వస్తువు ధ్వనిస్తుంది. ‘‘అతని చరితము మానవజాతి పరాయణము భావి జగదభ్యుదయస్ఫతము. ధర్మోవేతము, నీతిపథము, నిగమసూక్తినిభనై వెలయున్’’. ఇది వేదంతో సమానమైనదన్నారు.
‘అహింసా పరమో ధర్మః’ కదా, చూడండి.
శివాజీ చిన్ననాడు బిజాపురంలో రాచబటాలో నడిచిపోతూ, కసాయివారు తమ అంగడి ముందు ఒక ఆవును పట్టుకొని గొంతు కోయబోయే దృశ్యం చూచినాడు. అట్లే బాణ మట్లేగి, ధేనువుపై వ్రాలు కటారి కడ్డము ముందున్ దూకి తానిట్లనన్. ఎట్లన్నాడు?
‘ఇదియే ధర్మపథమ్ము? మానవులు గారే? జాలి లేదయ్యెనే?
మది- మీ కొండొక ముల్లు గ్రుచ్చుకొన నమ్మాయంచు వాపోదురే
కద? మీ బిడ్డల నెవ్వడైన చెనకంగా వాదుకుంబోదురే
కద? యేదిక్కును లేని జంతువనియేగా? కత్తులన్ దూయుటల్
రాచకొలువులో పలుకుబడి కలవాడు షాజీ. ఆయన పుత్రుడు శివాజీ. కసాయివారు కత్తిపారవేసి, ఆవు కట్లు విప్పి వదలినారు. నోటి కండ జారిపోయింది. ఈ కథ యింతటితో ముగియలేదు. ఈ వార్త సుల్తాను కొలువులో చర్చకు వచ్చింది. సుల్తాను ఉదార హృదయంతో శివాజీ చర్య సమర్థించి, గోహత్య తగదన్నాడు. అంతేకాదు- ‘‘మన బిజాపురమందు ఏమనుజుడైన తులవతనమున గోహత్య సలుపరాదు. అంగళులు పెట్టి మాంసంబు లమ్మరాదు. త్రోవ వెంట కన్నంట కొంపోవరాదు’’ అని శాసించినాడు. ‘‘నా యజ్ఞన్ వెలిపెట్టి పోవునెవడైనన్ గాని శిక్షార్హుడౌ’’ అన్నాడు.
శివాజీకి కులం మతం ముఖ్యం కాదు. అన్యమతాల మీద అకరాణ ద్వేషం లేదు. ధర్మం ముఖ్యం. ధర్మద్రోహి ఎవడైనా శిక్షార్హుడే. ఇది శివభారత హృదయం ‘యవనుల్ హైందవులన్న భిన్నత అసూయం జూపగాలేదు. తామెవరీ రాజ్యము నేలినన్ తగవు లేనే లేదు’ మఱి తగవు ఎక్కడుంది? ‘‘అవకాశంబును బట్టి, నీ నా యటంచు ఒక్క తెగకు అన్యాయంబు గావింప సహించలేడు. దీనినే ధర్మభంగ అసహిష్ణువర్తనము అన్నారు శాస్ర్తీగారు.
శివాజీకి తల్లి యెడ ఎంత భక్తి వుందో చెప్పలేను. తల్లితో అంటున్నాడు
ఉన్నది చేతశస్త్ర మదియున్ పదనైనది, లోన పౌరుషం
బున్నది మొక్కవోక అదియున్ పదనైనది, వెంట మార్బలం
బున్నది మున్ను దూక అదియున్ పదనైనది, ప్రాణశక్తి నీ
వన్నిటి బోసి, ఒక్క తెరువాడుము తల్లి! జయింతు విశ్వమున్
తిక్కనామాత్యుడు అలతి అలతి తెలుగు పలుకులతో లలితంగా పద్యం నిర్మిస్తాడు. కాని, పలుచోట్ల ధార సుళ్లు తిరుగుతుంది. శాస్ర్తీగారి ధారలో ఆ కొరత కనిపించదు. ఏ పద్యమైనా ధారాళంగా నడుస్తుంది. తిక్కన తెలుగు కొన్నిచోట్ల చిడిముడిపాటు కలిగిస్తుంది. తరువాత కవులు కొందరు పంతానికి అచ్చతెలుగు కృతులు రచించినారు. అవి తెలుగువారికి అర్థంకావు. శాస్ర్తీగారు అంతా అచ్చతెలుగు వ్రాసినా అది చక్కగా అర్థమవుతుంది. శివభారత రచనలవో వుండే విశేషమదే. జిజియాబాయి ఆదిపరాశక్తిత. ఆమె ఆశీర్వదిస్తే తిరుగులేదు. విజయం సిద్ధం అని శివాజీ విశ్వాసం. అలాగే జరిగింది.
శివభారతంలో భారత ధర్మం- ‘పూపులకంటె కోమలము పూజ్యము భారత భూపతి వ్రతాదైవము’ అనే సూత్రంలో ఇమిడి వుంది. కల్యాణిదుర్గ విజయవార్త వినిపిస్తూ, సరదారును, వాని రాణివాసమును బంధించి తెచ్చినామని చెపుతాడు సేనాపతి. శివాజీ వెంటనే ‘‘ఆ యేమి? యొక రాణివాసమును పుణ్యావాసమున్ దెచ్చినావా?’’ ఔద్ధత్య మోర్వ్రంజుమీ అని గర్జిస్తాడు. స్నిగ్ధాంబుదచ్ఛాయలో నవసౌదామిని బోలు ఆ యవనకాంతారత్నమున్ జూచి, ఓ జననీ! అనలజ్యోతుల ఈ పతివ్రతల పాపాచారులై డాయు భూజనులెల్లన్ నిజసందల్ తొరగి అస్త్ధ్వస్తులైపోరి? విత్తనమే నిల్చునె? మునె్నఱుంగమె పులస్త్యబ్రహ్మ సంతానము.. మా సర్దారుడు తొందరంమడి అపన్మార్గంబు నంబోయె. ఈ దోసంబున్ గని నొచ్చుకోకు, నిను జేర్తున్ నీ గృహంబిప్పుడే నా సైన్యంబును తోడుగా పనిచెదన్ నా తల్లిగా తోడుగా దోసికళ్లన్ నడిపింతు. నీ కనులయందున్ తాల్మి సారింపుమీ! అని నమస్కరించి కానుకలిచ్చి పంపిస్తాడు.
శివాజీ నరసింహస్వామివలె, భానుని కడుపు పులిగోళ్లతో చించిన కథ జగత్ప్రసిద్ధము. ఆ సందర్భమున శాస్ర్తీగారి రచన అనర్ఘము. అదను దప్పిన విడిపోవునంచు నొకడు, అనువు దప్పిన చెడిపోవునంచు నొకడు, నమ్మికలు లేని బాహుబంధముల దవిలి, నడిచిరి, ఎవడు ముందెట్లు పైబడునో యంచు ఖానుడు ఏనుగంతవాడు. సందిట నొక్కి నలిపివేయుదుననుకొనెను. శివాజీ సింహకివోరం. కడుపు చించిచీల్చి పండబెట్టినాడు. పురాణ కథలు అనుసంధించుటలో శాస్ర్తీగారు అద్భుత ప్రతిభాశాలి. ఔరంగజేబు సేనాధిపతి జయసింగ్ దండెత్తి వచ్చి అష్టదిగ్బంధం చేసినాడు. శివాజీ సంధికి రాక తప్పలేదు. జయసింగును కలిసికొని శివాజీ అన్నమాటలు- ‘‘నాయుదరైక మాత్రభరణంబున కింతలు నేయనేల? రాధేయుడనైన చాలు, ఒక తెంపున రెంటికి బోక, మాతృదాస్యాయతి బాపు తాక్ష్యడనయై బయలెక్కుట నిక్కె ఈతోదల్.
రాధేయుడగుట కొలువులో జేరుట. గాధేయుడగుట సన్యసించుట. శివాజీకి ఈ రెండు పట్టలేదు. గరుత్మంతునివలె మాతృదాస్య విముక్తికి పూనుకొన్నాడు. ఇదే కథ.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-సి.వి.సుబ్బన్న శతావధాని