వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు ఆర్. ఎస్. సుదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత ప్రతీకాత్మక మరణాన్ని ప్రకటిస్తూ వున్న వర్తమాన సాహితీ ప్రపంచంలో అసలీ పుస్తకానికి వున్న ప్రాముఖ్యత ఏమిటి? అనేది కూడా కీలకమైన ప్రశే్న. అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎలా వున్నా , ఒకానొక చారిత్రక సందర్భంలో ఈ పుస్తకం నిర్వర్తించిన పాత్రని, ముఖ్యంగా సాహిత్య విమర్శ పరిధిని విస్తృతపర్చటంలో ఈ పుస్తకం ప్రదర్శించిన ‘పాజిటివ్ రోల్’ని నిరాకరించే వీలులేదు.
ఆర్.ఎస్.సుదర్శనం విస్తృత అధ్యయనంతోపాటు అనేక రంగాలకు సంబంధించిన అవగాహన వున్న రచయిత. సృజనాత్మక రచనలు చేసే వ్యక్తికి విస్తృత అధ్యయనం, బహుళ రంగాలకు చెందిన పరిజ్ఞానం అంతగా అవసరం లేకపోవచ్చు. కానీ విమర్శకుడిగా కొనసాగదల్చుకున్న వ్యక్తికివి అత్యవసరం. విస్తృత అధ్యయనం, బహుళ శాస్త్రాలతో పరిచయం లేకుండా ఎవ్వరూ కూడా సాహిత్య విమర్శలో తమదైన ముద్ర వేయటం అసాధ్యం. సుదర్శనానికి వున్న విస్తృతమైన తాత్విక, సాహిత్య పరిజ్ఞానం ఆయనకి అల్లసాని పెద్దన్న నుంచి రాచకొండ విశ్వనాథశాస్ర్తీ దాకా వున్న రచయితల్ని విశే్లషించగలిగే శక్తిని ఇచ్చింది. రాచమల్లు రామచంద్రారెడ్డి సుదర్శనానికి మేరమీరిన మేథ అని నిందించారు కానీ అది నిజం కాదు. రాచమల్లు రామచంద్రారెడ్డి కూడా ఒకానొక అయిష్టత లోంచి అలా మాట్లాడారని అవగతమవుతోంది. నిజానికి ఈ మేర మీరిన మేధ కె.వి.రమణారెడ్డిలో చాలా వుంది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

బి. తిరుపతిరావు