వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు (ఆర్. ఎస్. సుదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే రమణారెడ్డి మార్క్సిస్టు కావటం వల్ల రామచంద్రారెడ్డి తప్పుపట్టలేదు.
సాహిత్యంలో దృక్పథాలు పుస్తకంలో సుదర్శనం విశే్లషించిన అల్లసాని పెద్దన్న, గురజాడ, ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, చలం, బుచ్చిబాబు, రావిశాస్ర్తీ, నోరి నరసింహశాస్ర్తీ లాంటి పదిమంది కాల్పనిక సాహిత్యకారులు సాహిత్య లోకంలో నిర్దిష్ట భావ సంచలనానికి కారణమయినవాళ్లు. రచయితలుగా స్వతంత్ర సాహితీ వ్యక్తిత్వంలేని వాళ్ల గురించి ఏమి రాసినా చెల్లుబాటు అవుతుంది. పాఠకుల ఉదాసీన వైఖరి కూడా ఇందుకు సహకరిస్తుంది. అయితే నిర్దిష్ట సాహితీ మూర్తిమత్వాలున్న రచయితలమీద విమర్శ రాయటం చాలా కష్టం. ఎందుకంటే, అప్పటికే, ఆ రచయితలకి ఏర్పడ్డ సాహిత్యపీఠాలు, ఆ పీఠాల్ని పూజించే భక్తబృందం ఆ రచయితలమీద ఈగవాలినా సహించరు. అటువంటి వాతావరణంలో ఎంతో కొంత నిష్పాక్షికంగా విమర్శ రాయటం అంత సులువయిన పనికాదు. అయితే సుదర్శనం ఈ పనిని కొంత సునాయాసంగానే నెరవేర్చగలిగారు.
రచయితకి, సమాజానికి వున్న సంబంధంలో సంప్రదాయవాదులు రచయితని దైవీకరించి సమాజాన్ని ద్వితీయం చేస్తే మార్క్సిస్టులు దీనికి ప్రతిగా రచయిత అనే వ్యక్తిని నిరాకరించి సమాజాన్ని దైవీకరించారు. ఫలితంగా ఒక అంశానికి వుండే రెండో పార్శ్వాన్ని ఇరువర్గాలు విస్మరించినట్టయింది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు