వినమరుగైన

నగరంలో వాన -కుందుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు వేళ్లు మాట్లాడుతున్నాయి. పాట చిక్కనవుతుంది. పదునెక్కుతుంది. అక్షరం దిక్కులు పిక్కటిల్లేట్లు పొలికేకతో దండోరా వేస్తుంది. కాంతి హృదయాలపై ఆర్ద్రతా నీలిమేఘాలు ధాటిగా వర్షిస్తున్నాయి. గాయాలు మాట్లాడుతున్నాయి.
వీటన్నింటికీ పరిణామక్రమం వుంది. దాని వెనుక వ్యక్తులున్నారు. వారి ఆర్తి వుంది. వారి తపన వుంది. వాటికి ఆచరణా ఉద్యమం వుంది. ఆ ఉద్యమంలో నాయకత్వ శ్రేణిలో లబ్దప్రతిష్ఠులైన వారున్నారు. వారిలో అగ్రగణ్యులు కుందుర్తి ఆంజనేయులుగారు. ఇది సాహిత్యం. అందునా కవిత్వానికి సంబంధించి.
ఇపుడు సతి లేదు. బాల్య వివాహాలు లేవు. స్ర్తి విద్య నిషిద్ధం కాదు. అస్పృశ్యత తీవ్రతా లేదు. ఈ మార్పులు, సంస్కరణలు వాటంతటవే జరిగిపోలేదు. వీటి వెనుక సంస్కర్తలున్నారు. వారి కృషి వుంది. ఇది సామాజికానికి సంబంధించి.
అక్షరం, సాహిత్యంలాగే సాహిత్యం- సమాజం అవిభాజ్యం. రెండింటి సత్ఫరిణామ కారకుల్ని స్మరించుకొని వార్నుండి స్ఫూర్తిపొందడం అందరితోపాటు ఎక్కువగా ఆయా రంగాలపట్ల ఆసక్తిగలవారి కర్తవ్యం.
భాష, సాహిత్యం సంస్కృతిలో అంతర్భాగాలు. పరస్పరాశ్రీతాలు. ఇవి త్రివేణి సంగమంగా కల్సి నాగరికతగా ఎదుగుతాయి. తరం తర్వాత తరానికి అందుతాయి. భాష, సంస్కృతి, నాగరికతగా మారే ప్రక్రియలో సాహిత్యం పాత్ర గణనీయమైనది.
భాషకు సంబంధించి వాడుక భాషను, సాహిత్యానికి సంబంధించి వచన కవితా ప్రక్రియను, మనిషి సమాజం భూమికగా, కేంద్రంగా, గమ్యంగా తనదైన సాహిత్య చారిత్రక పాత్రను పోషించిన ప్రాతఃస్మరణీయ సాహితీ వైశిష్ట్యం కుందుర్తిగారిది. అందువల్లనే వారు ప్రజాకవి, అభ్యుదయ కవి, ఆధునిక కవి, సామాన్యుని కవి, సామాజిక కవిగా ప్రసిద్ధులైనారు.
వారి మాటల్లోనే చెప్పాలంటే-
‘‘నా ఊహలో కవితకు శరీరం ప్రజల వాడుక భాష. దాని ఆత్మ వారి అభ్యున్నతి’’-
వస్తు రూపాల్ని ఇంత స్పష్టంగా చెప్పడమే గాక చివరంటూ దీనికి కట్టుబడిన వారిలో అగ్రగణ్యుడు కుందుర్తిగారు.
కుందుర్తి అనగానే మనకు ముందు సాక్షాత్కరించేది వచన కవితా ఉద్యమం. సాహితీ ఉద్యమం అంటే సాహితీ చరిత్రలో అంతర్భాగం. కనుక కుందుర్తి తెలియాలంటే చరిత్ర తెలియాలి. అభ్యుదయం తెలియాలి. ఆధునికతా తెలియాలి. వాటి లక్ష్యా లక్షణాలు, గమ్యా గమనాలూ తెలియాలి. కవిత్వాంశాలతోపాటు.
డిసెంబరు 16, 1922లో జన్మించిన శ్రీ కుందుర్తి, 1943లో తెనాలిలో తాపీ ధర్మారావుగారి అధ్యక్షతన జరిగిన అరసం మహాసభల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువకుల్లో బెల్లంకొండ రామదాసు, ఏల్చూరు సుబ్రహ్మణ్యంలతోపాటు కుందుర్తీ వున్నారు. అనంతరం వీరు ముగ్గురూ కల్సి నయాగరా కవితా సంకలనం తెచ్చి నయాగరా కవులుగా ప్రసిద్ధులైనారు. తదుపరి కుందుర్తి తెలంగాణ అనే తొలి తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి తెచ్చారు.
అంతకుముందే పఠాభి తన ఫిడేలు రాగాల డజన్‌లో
వచన కవితలనే దుడ్డుకర్రతో పద్యాల నడుములు విరగదంతాను
అన్నా నిజానికి ఆపనిచేసింది ‘కుందుర్తియే’నని విమర్శకులంతా అంగీకరించి, ఆమోదించి వారిని వచనకవితాపితామహునిగా సంభావించటం సాహితీ లోకానికి సుపరిచతం. ఇందుకు వారు కేవలం సంప్రదాయ నిరసనతో సరిపెట్టక వివిధరూపాల్లో అంటే సృజన, పీఠికలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, ఫ్రీవర్స్ అవార్డ్ లాంటివి ఎంచుకున్న మార్గాలు.
సాహితీకారులపై సహజంగా బాల్యం, విద్యాభ్యాసం ప్రభావం అధికంగా వుంటాయి. అయితే వీరి విషయంలో గమనార్హమైన అంశం- బాల్యంలో జాషువాగారికి శ్రోతగా వున్నా, అనంతరం, విశ్వనాథవారి శిష్యునిగా వున్నా సంప్రదాయ సిద్ధమైన వారి పద్య ప్రక్రియకు వ్యతిరేక దిశలో ఉద్యమ రూపంలో పయనించి తర్వాత వారికి మార్గదర్శకులు కాగలిగారు (ఆరుద్ర - సమగ్ర ఆంధ్ర సాహిత్యం- 13వ సంపుటం).
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-బి.లలితానంద్