వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు (ఆర్. ఎస్. సుదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీన్ని ఎంతో కొంత సవరించటానికి, కనీసం ఆధునిక సాహిత్యంలోనైనా సుదర్శనం ప్రయత్నించారు. సుదర్శనమే చెప్పుకున్నట్టుగా రచయిత సంఘంలోనివాడే గనుక అతని వ్యక్తిత్వం, ఆలోచన ఎంత స్వతంత్రించినా సాంఘికమైనవే. ఎంత సాంఘికమైనా అతని ప్రత్యేకతను నిరూపించేవే. ఈ అభిప్రాయాన్ని కేవలం ఒక ప్రకటనగా ఇవ్వకపోవటంవల్ల, ఆ నిర్వచనంలోంచి సాహిత్యాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నం చేయటంవల్ల తెలుగు సాహిత్యంలో చాలాకాలం నుంచి పాతుకుపోయిన జంట ప్రత్యర్థుల వాదం నుంచి, అంటే ప్రతి అంశాన్ని రెండుగా విడగొట్టి చూసే ధోరణి నుంచి సుదర్శనం బయటపడి ఆలోచించగలిగారు. అలా ఆలోచించటంవల్లే సుదర్శనం వ్యాసాలకి ప్రాముఖ్యత పెరిగింది.
ఆధునిక సాహిత్యాన్ని సంప్రదాయవాదులు చిన్నచూపు చూశారు. అలాగే సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునికులు నిరాకరిస్తూ వచ్చారు.
ఈ సందర్భంలో సంప్రదాయవాదులు సంకుచితత్వాన్ని అర్థం చేసుకోగలం కానీ ప్రజాస్వామిక లక్షణం ప్రాతిపదికగా నడవాల్సిన ఆధునిక సాహిత్యకారులు సంప్రదాయ సాహిత్యాన్ని నిరాకరించటాన్ని అవగాహన చేసుకోలేం. ఆధునిక సాహిత్యకారులకి సంప్రదాయ సాహిత్యంమీద చిన్నచూపుకి ఆ సాహిత్యపు భావజాలం మాత్రమే కారణం కాక అసలు మొత్తం సాహిత్యమే కారణమయింది.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు