వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు (ఆర్. ఎస్. సుదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంప్రదాయ సాహిత్యంపట్ల అకారణంగా ఆధునికుల్లో పాతుకుపోయిన అయిష్టతవల్ల ఒకరిద్దరు తప్పితే ఎక్కువమంది ఆధునిక విమర్శకులు ప్రాచీన సాహిత్యంమీద విమర్శ రాసే పనికి పూనుకోలేదు.
ఆధునిక విమర్శకులు సంప్రదాయ సాహిత్యంమీద విలువల తీర్పులు చెప్పటం తప్ప, నిర్దిష్టంగా వాచకాల పరిశీలనకి పూనుకున్న సందర్భాలు అరుదు. ఆధునిక సాహిత్య విమర్శలోని ఈ పరిమితిని అధిగమించి అల్లసాని పెద్దన్నమీద, ఆయన మనుచరిత్రమీద ఒక విశే్లషణాత్మక వ్యాసం రాశారు సుదర్శనం.
సాహిత్య విమర్శకి ఆపాదించే ప్రయోజనాల్లో వివిధ విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయాలు వుండవచ్చేమో కానీ, విమర్శ అంతిమ లక్ష్యం పాఠకుణ్ణి వాచకం వైపు నడపటం అనే విషయంలో విమర్శలకి భేదాభిప్రాయాలు వుండే వీలులేదు.
సుదర్శనం రాసిన ప్రతి వ్యాసం పాఠకుణ్ని మూల రచన వైపు నెడుతుంది. వెంటనే పాఠకుడు ఆ పుస్తకాన్ని చదవాలనే కుతూహలంలోకి నెట్టబడతాడు. ఇంతకంటే గొప్ప పని విమర్శకుడి నుంచి అన్ని సందర్భాలలో ఆశించలేం. సుదర్శనం వ్యాసాలు ఆ మేరకు విజయం సాధించినట్టే లెక్క. గురజాడ కన్యాశుల్కం మీద సుదర్శనం రాసిన విమర్శ చాలా ప్రామాణికమైన విమర్శ.
ముఖ్యంగా గిరీశం పాత్రని మరికొంత సానుభూతితో పరివీలించే ప్రయత్నం చేశారు సుదర్శనంగారు. జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ, జీవితానికి లొంగిపోకుండా పైచేయిగా వుండటం, అందుకు అవసరమైన హాస్యదృష్టిని కలిగివుండటం గిరీశం పాత్ర తత్వంగా సుదర్శనం గుర్తించారు. అలాగే షేక్‌స్పియర్ సృష్టించిన ఫాల్‌స్ట్ఫా పాత్రని గిరీశంతో పోల్చి సోదాహరణంగా వివరించటం ద్వారా గిరీశాన్ని విశ్వ సాహిత్యంలో అరుదైన పాత్రగా ప్రకటించారు సుదర్శనం. గిరీశం, ఫాల్‌స్ట్ఫా పాత్రల మధ్య సుదర్శనం చూపిన తులనాత్మక అధ్యయనం చాలా విలువయినది.
సాహిత్య పాత్రల గురించి, వాటి స్వరూప స్వభావాల గురించి కేవలం నైతిక కోణం నుంచి మాత్రమే తీర్పు చెప్పే విమర్శ అంగీకారయోగ్యమయిన విమర్శ కాదు. సరిగ్గా ఈ నైతిక కోణాన్ని అధిగమించి గిరీశం పాత్రని చూడగలిగారు సుదర్శనం. ఈ సందర్భంలో రారా గారి మాటలు రారా పరిమితుల్ని తెలిజేస్తాయి తప్ప సుదర్శనం అవగాహనా రాహిత్యాన్ని కాదు. రారా భావించినట్లు గిరీశంమీద గురజాడకు కూడా అంత ద్వేషం లేదు.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు