వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు (ఆర్. ఎస్. సుదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు ద్వేషం నుంచి పుట్టిన పాత్రలు లేక అనురాగం నుంచి పుట్టిన పాత్రలయినా టైప్స్‌గా మిగులుతాయి తప్ప, జన జీవాలు వున్న పాత్రలుగా మిగిలే వీలులేదు.
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రధాన నవలలను విశే్లషిస్తూ సుదర్శనం రాసిన సుదీర్ఘ వ్యాసంలో విశ్వనాథ సత్యనారాయణ జీవన, తాత్విక, సాహిత్య అవగాహనల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయటం కన్పిస్తుంది. హైందవ సంప్రాదయ నిబద్ధమైన పరిధిని దాటి వెళ్లకూడదని నిర్ణయించుకుని మరీ రచన చేశారు విశ్వనాథ సత్యనారాయణ. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వనాథ దృఢసంకల్పమే ఆయన బలానికి, బలహీనతకు కారణమయ్యాయంటారు సుదర్శనం.
పాత్రలు ఆయా సందర్భాలలో చేసే వ్యాఖ్యలను, వ్యాఖ్యానాలను అనుసరించి విమర్శకుడు పాత్రల్ని అంచనా వేయకూడదు. ఒక పాత్ర ప్రవర్తనని కీలకాంశంగా చేసుకుని విశే్లషించగలిగినప్పుడు ఒక పాత్ర నిజతత్వాన్ని అర్థం చేసుకోవటం సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని సుదర్శనం చాలా స్పష్టంగా గుర్తించారు. అందువల్లే గిరీశంనుంచి రావిశాస్ర్తీ, సుబ్బయ్య దాకా వున్న అనేక పాత్రల స్వరూప స్వభావాల్ని తాత్త్వికంగా విశే్లషించారు సుదర్శనం.స్పష్టమయిన జీవిత లక్ష్యాల్ని, ఉద్దేశాల్ని ప్రకటించి అందుకు అనుగుణంగా రచన చేయటంలో విశేష ప్రతిభ కనపర్చిన గురజాడ, విశ్వనాథ లాంటివాళ్ల రచనల్ని విశే్లషించటం కొంత సులభమే. ఇందుకు భిన్నంగా మొదట్లో ఒక తాత్త్విక అవగాహనలో వుండి ఆ తరువాత అందుకు పూర్తి భిన్నమైన అవగాహనలోకి మారిపోయిన రచయితల వాచకాల్ని విశే్లషించటం అంత సులువైన పనికాదు. రచయిత మూలతత్త్వాన్ని గ్రహించి ఆ తత్త్వానికి అనుగుణంగా రచనని వ్యాఖ్యానించే సుదర్శనంకి ఈ పని మరీ కష్టం. రచయిత తాత్త్విక పరిణామాల్ని సుదర్శనం చాలా లోతుగా అధ్యయనం చేయటం వల్ల ఆయన పని తేలికయింది.
సాహిత్యంలో దృక్పథాలు అనే సంపుటిలో మూడు వౌలిక రచనలు అంటే గోపీచంద్, బుచ్చిబాబు, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీలను గురించి రాసిన వ్యాసాలు ప్రామాణికమైనవని చెప్పవచ్చు. గోపీచంద్ రచించిన అసమర్థుని జీవయాత్రలోని సీతారామారావు పాత్రని నడిపించిన హేతువాదాన్ని చాలా స్పష్టంగా వివరించారు సుదర్శనం. తెలుగు సాహిత్యంలో అంటే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక పాత్రని సమగ్రంగా విశే్లషించటం ఆ పాత్ర తాత్త్వికతని వివరించటం అనేది అరుదైన పని.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు