వినమరుగైన

సాహిత్యంలో దృక్పథాలు (ఆర్. ఎస్. సుదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదర్శనం సీతారామారవు పాత్రతోపాటు బుచ్చిబాబు, దయానిధి, రావిశాస్ర్తీ, సుబ్బయ్య పాత్రలను శక్తివంతంగా విశే్లషించి చూపారు.
సుబ్బయ్య పాత్రని ఆత్మన్యూనత భ్రాంతి సిద్ధాంతంలోంచి, అలాగే బుచ్చిబాబు దయానిధి పాత్రని ఈడిపస్ కాంప్లెక్సు దృక్కోణం నుంచి అవగతం చేసుకునే ప్రయత్నం చేశారు సుదర్శనం. తెలుగు సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నం చాలా అరుదు.
సాహిత్యంలో దృక్పథాలు సంపుటిలో చలం, జి.వి.కృష్ణారావుల గురించి రాసిన వ్యాసాలు కూడా ఆసక్తిదాయకంగా వున్నప్పటికీ నోరి నరసింహశాస్ర్తీ ధూర్జటి అనే చారిత్రక నవల మీద రాసిన వ్యాసం మరీ పేలవంగా వుంది. చారిత్రక నవల గురించి సుదర్శనం భావాలు మరీ గందరగోళంగా వున్నాయి. చలం సమాజంమీద చేసిన విమర్శ వెనుక ఉద్వేగం తప్ప నిర్మణాత్మకత లేదని, అలాగే చలానికి జీవితపు చివరిలో తప్ప జీవితాన్ని గురించిన నిర్దిష్ట తాత్వికత ఏర్పడలేదని సుదర్శనం చేసిన వ్యాఖ్యలు చలం గురించి లోతుగా తెలిసినవాళ్లు ఎవరూ అంగీకరించరు. జీవితాన్ని గురించి ముఖ్యంగా స్ర్తి జీవితాన్ని మరింత స్పష్టమయిన ప్రణాళికలతోనే చలం రచనా రంగంలోకి ఉపక్రమించారనేది సాహిత్య లోకంలో రహస్యమేమీ కాదు.
చివరిగా చెప్పాల్సిందేమంటే సుదర్శనం కేవలం పండిత స్థాయిని దాటి మేధావిగా ఎదిగిన విమర్శకుడు. సుదర్శనం అభిప్రాయాలతో అందరూ అంగీకరించకపోవచ్చు. నిజానికి ఈ సంపుటిలో అభ్యంతరకరమైన అంశాలు అనేకం వున్నాయి. అంత మాత్రం చేత ఒకానొక చారిత్రక సన్నివేశంలో విమర్శకి మరొక కోణాన్ని చూపించటం ఈ పుస్తకానికి వున్న ప్రాధాన్యతని తిరస్కరించలేం. తెలుగు సాహిత్య విమర్శ వికాసంలో ఈ పుస్తకానికి వున్న ప్రత్యేక స్థానాన్ని కాదనలేం.
- సంపూర్ణం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు