వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం సమాజ శ్రేయస్సు లక్ష్యముగా గలది. ఈ లక్ష్య సాధనకు అది బహురూపాలలో దర్శనమిస్తుంది. పదాలు, పాటలు, కథలు, కవిత్వం, నవల, నాటకం, విమర్శ- ఇలా సాగే రూపాలలో కవిత్వం తలమానికమైనది. కవి ఋషి వంటివాడు. గనుక అతని సామాజిక దర్శనం ఉన్నత దృక్పథం గలిగి ఉంటుంది. ఉత్తమ కవి చిత్రించే సమాజం ఏ కాలానికి చెందినదైనా అతని కవిత సార్వకాలిక విలువలతో ప్రకాశిస్తుంది. కాలానికి అతీతంగా నిలుస్తుంది. ఇలా నిలిచే కవిత్వంలో గడియారం వెంకటశేషశాస్ర్తీగారి శివభారత కావ్యం ఒకటి.కవిత్వం పరిమిళవంతమైన పుష్పం అయితే విమర్శ ఆ పరిమళాన్ని దశదిశలా వ్యాపింపజేసే వాయువు వంటిది. కావ్య పరామర్శ చేసే విమర్శకుడు కవి హృదయపులోతుల్ని ఆవిష్కరించటంలో తాను వివిధ రచనలలోని మాధుర్య మకరందాన్ని, మధుకరుడై పట్టి తెచ్చి తన మదిలో పెట్టిన పట్టులోంచి తగినవిధంగా వెలికితీసి దానితో కవి హృదయాన్ని రంగరించి పాఠకులకు కావ్యామృతాన్ని పంచి పెడతారు. సదసద్వివేకాన్ని కలిగిస్తాడు. ఇటువంటి ఉత్తమ శ్రేణికి చెందిన విమర్శలలో సర్దేశాయి తిరుమలరావుగారు అగ్రగణ్యులు.
కవి గడియారం వేంకట శేషశాస్ర్తీగారు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్లదినె్న గ్రామంలో 15.2.1901న జన్మించారు. సంస్కృతాంధ్ర సాహిత్యాలతోపాటు వేద వేదాంగ జ్యోతిషశాస్త్రాలూ అధ్యయనం చేశారు. దుర్భాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్నాళ్ళు జంటకవిత్వం చెప్పారు. శతావధానాలు చేశారు. గండపెండేర, జయఘంటికా, సింహకంకణ సత్కరాలు పొందారు. శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. అనర్ఘ రాఘవము, కిరాతార్జునీయము, మల్లికా మారుతము, పంచబాష విజయములను సంస్కృతంనుండి అనువదించారు. తెలుగులో శివభారతము కాక వాల్మీకి చరిత్రము, దుర్గాస్తోత్రములను రచించారు.
సర్దేశాయి తిరుమలరావు 1928 నవంబరు 28న కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జోరాపురం గ్రామంలో జన్మించారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రసాయనిక శాస్త్రంలో యంఎస్‌సి పట్టా పొంది 1954 అనంతపురంలో ఒటిఆర్‌ఐలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి 1969లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనా పత్రికలలో 400పైగా శాస్ర్తియ వ్యాసాలు వ్రాశారు. సంస్కృతాంధ్ర సాహిత్యాలతో ఐరోపా భాషా సాహిత్యాలను కూడా బాగా అధ్యయనం చేశారు. కన్యాశుల్క నాటక కళ వీరి ప్రసిద్ధ గ్రంథం. ఆజన్మ బ్రహ్మచారి అయిన వీరు 1994 మే 10న మరణించారు.బహుముఖ ప్రజ్ఞగల తిరుమలరావుగారు గడియారం వారి శివభారతమును సాహిత్య తత్వము- శివభారత దర్శనము పేర దర్శించి, 1971లో ఆంధ్ర సాహితీ లోకానికి అందించిన గ్రంథము. 364 పుటల విస్తృతి గలది.

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్