వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12 అధ్యాయాలుగా రచించబడిన రుూ గ్రంథాన్ని ‘సమకాలిక కవిత్వముపై విచారధారలు రావలెను’ అన్నతమ మతాన్ని ఆచరణలో చూపించుటకు, మమ్మటుడు చెప్పిన కావ్య ప్రయోజనములలో ఒకటైన ‘శివ-ఇతరక్షతి’ని సాధించుటకు, శాస్తక్రారులు, సాహిత్యకారులు అను రెండు ద్వీపాలకు మధ్య వారధి కట్టుటకు రచించినట్లుగా నివేదనలో వెల్లడించారు.
ఈ నివేదనలోనే కవిత్వం మానవుని ప్రగతిపథానికి ఎగురగలిగేలా చేసే స్ప్రింగ్ బోర్డుగా ఉండాలని లక్షణనిర్దేశం చేస్తూ అటువంటి లక్షణాలు గల వాక్యాలను విశ్వసాహిత్యం నుండి ఉదహరించారు.
‘సాహిత్యతత్త్వము’ అన్నది రుూ గ్రంథానికి మొదటి అధ్యాయము. కవి హృదయావిష్కారము చేసి కావ్యావగాహనకు దోహదము చేయుటకు, దోషముల వేరుపరచి వానివలన కావ్యఘనత న్యూనముకానుట్లు చేయుటకు సాహిత్య విమర్శనా ధర్మము’ అని విమర్శకుని ధర్మాన్ని ప్రకటించి తిరుమలరావుగారు భావుకుడైన విమర్శకుని కొరకు కవి శతాబ్దాలు ఎదురుచూస్తుంటాడని, కవిలోక బాంధవులైన అటువంటి సహృదయ విమర్శకులలో ఆంగ్లమున టి.ఎస్.ఇలియట్, ఎజ్రా ఫౌండ్, వాల్టర్ పాటర్, ఫ్రెంచి భాషకు సెయింట్ బీవ్, రష్యన్ భాషకు ఇల్యా ఎహ్రెన్‌బర్గ్‌లు ముఖ్యులని పేర్కొన్నారు. సమకాలిక రచనలపై సాహిత్య విమర్శ చేయటంలో మూడు ముఖ్యమైన ఇబ్బందులను గుర్తించారు.
1.అది కృతజ్ఞతా రహిత ప్రక్రియ కావటం.
2.సమకాలీన కావ్యస్థానాన్ని నిర్ణయించటం కష్టం కావటం.
3.కాలానుగుణంగా మారే సాహిత్య సిద్ధాంతాలకు, అభిరుచులకు గిట్టని సమకాలిక రచనలు ఆ కాలంలో అనాదరణకు గురై భవిష్యత్కాలంలో జనాదరణీయాలు కావటం.కావ్య పరిశీలనా పద్ధతులైన లక్ష్యానుసరణ పద్ధతి, లక్షణానుసరణ పద్ధతి, కవి మార్గానుసరణ పద్ధతులలో కవి మార్గానుసరణ పద్ధతే ఉత్తమమైనదని తిరుమలరావుగారి తీర్పు. కరుణరసాన్ని భవభూతి, ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యతలను నన్నయభట్టు, ప్రాతవడ్డ మాటలు వాడనని తిక్కన- ఇలా ప్రాచీనులనుండి దిగంబర కవుల వరకు కవులు తమ కవిత్వంలో ఏఏ కవితా గుణాలు ఉన్నాయని స్వయంగా పేర్కొన్నారో ఆయా గుణాలు వారి కవిత్వంలో ఉన్నాయా లేదా అని పరిశీలించటం కవి మార్గానుసరణ పద్ధతిగా నిర్వచించబడింది. ఒక కవిత్వ పద్ధతి మరొక కవి కవిత్వ పద్ధతితో పోల్చరాదని, ఎంతమంది కవులున్నారో అన్ని అలంకారిక మతాలు, అన్ని సంప్రదాయాలు ఉన్నాయని వీటి అవగాహనమే విమర్శకుని విధి అని ప్రకటించారు. కావ్యము సాలీడు వంటిదని, అది స్వయంభవ సాహిత్య సూత్ర తంతువుల మధ్య భద్రంగా ఉంటుందని అంటారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం