వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాక అరోచకుడు, సతృణాభ్యవహారి, మత్సరి, తత్వాభినివేశి అని రాజశేఖరుడు పేర్కొన్న చతుర్విధ విమర్శకులలో తత్వాభినివేశి మార్గముత్తమమైనదని పేర్కొంటూ ఈ అధ్యాయాన్ని ఇలా ముగించారు.
‘‘కావ్య రచన బాధాయుతము. కావ్య విమర్శనము బాధ్యతాయుతము. కావ్యము పాకము. విమర్శనము రుచిగ్రహణ పారీణత. కావ్యము సుగంధ పుష్పము. విమర్శనము మందానిలము. కావ్యము మకరంద భరిత ప్రసూనము. విమర్శనము మధుపము. కావ్యము అనాహతనాదము. విమర్శనము విమలగాంధర్వము, కావ్యము తుషా ధాన్యముల విశ్రమమైనట్లయిన విమర్శన శూర్పము. ఇది సాహిత్య తత్వము’’.
కావ్య నామము, స్వరూపము అన్న రెండవ అధ్యాయములో ‘‘కవులు ఇతివృత్త సూచనము, చమత్కృతి, ఉచ్ఛారణా సౌలభ్యము, అక్షరరమ్యత, సంకేత గూఢార్థములు రామణీయత అను గుణములు’’ ప్రతిబింబించేలా కావ్యాలకు పేరు పెడతారని చెపుతూ ప్రాచీన నవీన సంస్కృతాంధ్ర కవులేకాక రవీంద్రనాథ ఠాగూరు, జార్జిహెర్బర్ట్‌లు వంటివారు తమ తమ రచనలకు పెట్టిన పేర్ల ఔచిత్యాన్ని చక్కగా చర్చించారు. అభిజ్ఞాన శాకుంతలము అన్న పేరులో అన్ని గుణాలు శోభించాయని ప్రస్తుతించారు. శివభారతము అన్న పేరులో విస్తృతార్థ పుష్టి, శబ్దగాంభీర్యము, ఉచ్ఛారణా సౌలభ్యము, అక్షర రమ్యత అన్న సుగుణాలు గలవని విశదీకరించారు. శివభారతములోని శివ శబ్దము పరమేశ్వరునికే కాక శివాజీకి కూడా సంకేతం కావటానికి కవి చెప్పిన కారణాలను ఇలా ఉదాహరించారు.
మూడవ కన్ను నెన్నుదుట, ముమ్మొనవాలు కరంబునందు రే
ఱేడు శిరమ్మునందుఁ జిగిరింపక నాఁడనసూయ యింటఁబా
రాడిన పాపఁడే మన గృహమ్మున నేఁడుదయించెనేమొ..
శివ మార్ర్దా నక్షత్రము
శివ దైవత మమ్బతకరుఁడు చెందినవేళన్
గవి దైవత వృషరాశిన్
భువనోద్ధారకుడు సుతుఁడు పుట్టె నరేంద్రా!
ఆర్యమతములఁ బరులు ఱపాడునాఁడు
శంకరాచార్యుగన్న వైశాఖ పంచ
మీ దినంబిది నేడు జన్మింపజేసె
నపరశివు’’..
శ్రీ శివాదేవి కరుణ నార్జించు కతన
నిపుడు శివనేరు దుర్గమందెనయు కతన
ముందు హైందవ ధర శివంబందు కతన
వతనికి ‘శివాజి’యను నామ మేనొనర్తు
శివభారతము అన్న పదము శివాజీ యొక్క భారతదేశము అనిగాని, శివాజీ నాటి భారతదేశము అని గాని, భారత శివము- అనగాభారతదేశ క్షేమమును వర్ణించిన కావ్యము అనిగాని పాఠకునకు భావస్ఫురణము కలిగిస్తుందని వివరించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

- సూర్యదేవర రవికుమార్