వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు శివాజీ నాయకుడైతే శివాజీకి భారతదేశము నాయకురాలు. వీరిరువురిది తల్లీబిడ్డల సంబంధం. తల్లి దాస్యాన్ని తొలగించటం కొడుకు విద్యుక్త ధర్మం. ఈ ధర్మం కథా వస్తువుగా గలది శివభారతము అని ఎంతో హృదయంగమంగా కావ్యనామ ఔచిత్యాన్ని ఆవిష్కరించారు తిరుమలరావుగారు.
పిల్లలమర్రి పినవీరభద్రుని శృంగార శాకుంతలము, సంకుసాల నరసింహ కవి కవివర్ణ రసాయనము, జక్కన కవి విక్రమార్క చరిత్రములతో తెలుగు సాహిత్య చరిత్రలో నిజమైన ప్రబంధ యుగం పుట్టిందని పేర్కొంటూ భామహుడు, దండి ప్రతిపాదించిన మహాకావ్య లక్షణాలను వివరించి ఆ లక్షణములు గలిగిన శివభారతము శివాజీ ప్రబంధమని స్పష్టపరిచారు. ఇందుకు శివభారతములో గల నగర, పర్వత, నదీ సముద్ర ఋతు, ఉషోదయ, సూర్యోదయ, చంద్రోదయ, మృగయా, జలక్రీడ మధుపాన రతోత్సవ, వియోగ, వివాహ, కుమారోదయ, మంత్ర, దౌత్య, ప్రయాణ, యుద్ధ, నాయకాభ్యుదయ వర్ణనలను ఎత్తిచూపించారు. ఈవర్ణనలు అనతి విస్తారత, స్వాభావికత,కథ సన్నివేశ ససాయకారిత అనే లక్షణాలతో ఒప్పుచున్నవని ప్రశంసించారు. శివభారతము - రఘువంశము, బుద్ధ చరితము, హర్షచరితము, మధురా విజయము వంటి రచనే కాని, శివాజీ జీవిత చరిత్ర మాత్రమే కాదు కనుక శివాజీకి ఔరంగజేబు కుమార్తె జేబున్నీసాకు సంబంధించిన విషయాలను ప్రస్తావించలేదని వెల్లడించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

సూర్యదేవర రవికుమార్