వినమరుగైన

నగరంలో వాన -కుందుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతటి అభ్యుదయ, ఆధునికతలు పుణికిపుచ్చుకున్నా అబ్బూరి వరద రాజేశ్వరరాగారు (కవన కుతూహలం) ‘కుందుర్తినేవిశ్వనాథవారి నిజమైన శిష్యుడు’ అనడం వారి వ్యక్తిత్వానికి గీటురాయి. సంప్రదాయ ప్రక్రియల్లోనూ వారి అభినివేశానికి మచ్చుతునక.
చేరా (స్మృతి కిణాంకం) అన్నట్లు- ‘‘కవిత్వం పట్ల వారి తపన వర్ణనాతీతం’’ -ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీతలు, వారి కావ్యాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు.
సామాన్యంగా సాహితీ ఉద్యమ సారథులగ్గాని దానితో పూర్తి అనుబంధం వున్నవారికిగాని ఉద్యమ ప్రభావం వారి సృజనపై అపసరించి వాటి విలువల్ని కుదరించే ప్రమాదం ఉంటుందని అంటుంటారు. ఇది కుందుర్తిగారి విషయంలో వాస్తవం కాదని నిరూపించిన వీరి కవితాసంపుటాల్లో నగరంలో వాన సుప్రసిద్ధమైంది.
కుందుర్తిగారి జీవితమూ- కవిత్వమూ వేరు వేరు కాదు. వారి తాత్వికతకు, వ్యక్తిత్వానికి సాహితీరూపం వారి కవిత్వం. వారి కవిత్వానికి, దాని ఆత్మకు భౌతిక రూపం వారి వ్యక్తిత్వం. ఇంతగా పరస్పరం మమేకమైనవారు అరుదుగా ఉంటారు.
ఈ విషయానే్న వీరి నగరంలో వాన నిరూపిస్తుంది. ఆద్యంతమూ ఇందులోని కవితా ఖండికల్లో వైవిధ్యం ఉంది. విస్తృతి వుంది.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-బి.లలితానంద్