వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే ఈ కావ్యములో ప్రయోగింపబడిన 393 జాతీయాలను, నుడికారాలను, 43 చక్కని మాటలను, 22 క్రియా పద ప్రయోగ విన్యాసాలను, సంస్కృత సమాస భూయిష్ట రచనలను, తేటతెనుగు పద్యాలను, అక్షర రమ్యతనిచ్చే అనుప్రాస రచనలను, ఒకసారి కంటె ఎక్కువగా వచ్చిన వాక్యాలు- సమాసాలను, పొత్తు, తాండవములు, మీసములు, సమాధి పదాల ప్రయోగ వైచిత్రిని, నూత్న కవి సమయాలను, దేశ్య పదాలను, ఊత పదాలను అన్నిటిని విస్తరభీతిలేక ఎత్తి చూపించారు.
5వ అధ్యాయము వచస్సు- ఛందస్సు అన్నది. సంస్కృతాంధ్రలలోని వాక్యాలు కాక అనేక శాస్త్ర గ్రంథాలు వీనులవిందైన ఛందస్సులో రుచిమంతమైన కవిత్వంతో ఉండటంవలన అవి బహుళ ప్రజాదరణ పొందాయని, కొందరు రచయితల గద్య రచనలు కూడా పద్యాలుగా ఉంటాయని, చేతనా చేతన ప్రకృతి లయబద్ధమైనది కనుక, లలిత కళలన్ని లయ గుణము కలిగినవి కనుక కవిత్వం కూడా ఛందోరూప లయాన్వితంగా ఉండటం సహేతుకమేనని తిరుమలరావుగారు సుదీర్ఘ చర్చానంతరం అభిప్రాయపడ్డారు. అలాగే ఛందస్సును కవి ఏ విధంగా ఉపయోగించుకొంటాడనే విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరిపారు. కవి ఛందస్సును ముఖ్యంగా మూడు విధాలుగా ఉపయోగించుకొంటాడని చెప్పారు. వర్ణనీయ విషయంలో నామసామ్యం గల ఛందస్సును ఎన్నుకోవటం మొదటి విధం. ఏనుగు క్రీడను మత్త్భే విక్రీడిత వృత్తంలోను, స్వాగత వచనాలను స్వాగత వృత్తంలోను, క్రౌంచ పద పక్షుల వర్ణనను క్రౌంచ పదవృత్తంలోను- ఇలా సాగిన ననె్నచోడుని కుమార సంభవములోని వర్ణనలు, పాట రాగం పేరును పాటలోనే ఇమిడ్చిన ముత్తుస్వామి దీక్షితుల కృతులు, కొక్కొండ వెంకటరత్నంగారి స్వీయ సృష్టి కంగారూ ఛందస్సు మొదలైన వాటిని రుూ విధానానికి ఉదాహరణలుగా ఇచ్చారు. రెండవ విధం- వర్ణనీయ విషయ అవస్థకు తగిన ఛందస్సును ఎన్నుకోవటం -

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

- సూర్యదేవర రవికుమార్