వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనికి వాల్మీకి, శ్రీశ్రీ, ఎఱ్ఱన, పెద్దన, విశ్వనాథ సత్యనారాయణ, కాళిదాసుల రచనలతో పాటు బైరన్, షేక్‌స్పియర్, హాప్‌కిన్స్ రచనలనూ ఉదాహరించారు. వర్ణనీయ విషయ అవస్థకు సంబంధం లేని ఛందస్సును ఎన్నుకొనటం మూడవ విధం. దీనికి తిరుమలరావు గారు గతి తార్కిక పద్ధతి అనే పేరు పెట్టి తిక్కన, పాపరాజుల రచనలను ఉదాహరణలుగా చూపించారు. ‘కవిత్వము నిజముగా గొప్పదైనపుడు ఇది ఛందస్సు, ఇది పద్యము, ఇది విషయము అని విడివిడి చేయుట కష్టమే. ‘‘రాయైన కొంత మేల్ నారాయణ’’ అని కళాపూర్ణోదయములో సుగాత్రి వాపోయిన పద్య ఛందస్సు కందమనునది గణవిభజన చేసిన గాని నమ్మకము కుదరదు. చెప్పవలసిన సంగతి, దానిని చెప్పిన సరళి సరిపోయినవి. ఇదే ఛందస్సు ధ్యేయము’’ అని స్పష్టంగా చెప్పారు.శార్దూల విక్రీడితమును గురించి తిరుమలరావుగారు అద్భుత వివరణ నిచ్చారు. శార్దూల శరీరము ‘‘కుంచించుటకును, దీర్ఘీకరించుటకును, పిల్లివలె మెత్తగ సడిలేకుండుటకును, లేడివలె వడిగ పరిగెత్తుటకును, చెంగున దూకుటకును, లోయ లోనికి దిగుటకును, దేహము అలలుగ కదుల్చుటకును వీలుగ ఉండును. ఇక శార్దూల శరీర సౌందర్య మద్వితీయమైనది. అట్టి చిత్ర ప్రకృతిగలదే శార్దూల విక్రీడిత వృత్తము’’. ఇటువంటి శార్దూల వృత్తాన్ని ప్రాచీన కవులు నవరసాలను, తిట్టు దీవెనలను, ప్రసన్నతను వర్ణించే సందర్భాలలో ప్రయోగించారని, శివభారతములో కోప రోష రౌద్రాలు, ఉపాలంభము, నమ్మకము, గోడు, ఉపశమనం, అనునయం, విరక్తి, శూరము, నిస్సహాయత, హితబోధ, కాలజ్ఞానం, అంగలార్పు, నయబోధ, నచ్చచెప్పుట, కోపం, ఆశ్చర్యం, సంవాదం, రౌద్రం, విన్నపం, ఖడ్గయుద్ధం, పశ్చాత్తాపం, తిట్టు, విజృంభణం, యుద్ధ సమారంభం, ప్రతీకారం, పటాటోపం, ఆత్మోత్కర్ష, కులోన్నతి, సంతానం, ఆక్షేపణ, ఛత్రపతి శివాజీ వర్ణన ఘట్టాలను వర్ణించటానికి ఉపయోగించబడిన విషయాన్ని ఉదాహరణలతో చూపించారు. శివభారత పద్య సంఖ్యలో శార్దూలాలు సగమున్నాయని చెప్పారు. మొదటిపాదమున మందగమనము, రెండవ పాదమున ఆమంద గమనము గల్గిన ఆటవెలది ఛందము ప్రసన్న, ప్రశాంత భావ వ్యక్తీకరణకే తగినది కనుక శివభారతమున అవి 22 మాత్రమే ప్రయోగించబడినవని అవి కూడా లోకోక్తులు, జాతీయాలతో నిండి వేమన పద్యాల స్థాయిలో ఉన్నాయని వివరించారు. తెలుగు సాహిత్య విమర్శలో ఛందఃప్రయోగ వైశిష్ట్యాన్ని ఈ విధంగా విప్పిచెప్పిన విమర్శకులు తిరుమలరావుగారు కాక మరొకరు లేరని చెప్పవచ్చును. ఆరవ అధ్యాయము ప్రకృతి ఔచితి అను పేరుగలది.

- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్