వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30 పేజీలు విస్తరించిన ఈ అధ్యాయ విషయమంతా 5,6 సంవత్సరముల వయసుగల శివాజీ తల్లిని ఊరడించు సందర్భములో రచించబడిన-
జననీ! యేమిది బిడ్డతో గిరి గుహా స్వచ్ఛంద నిష్పన్నతన్
గను సింగంబును రెచ్చఁగొట్టి బ్రతుకంగ నెవ్వఁడూహించె నీ
కనుసోనల్ గురియించి దప్పినడపంగా నెవ్వఁడాసించె నిం
డినకుండన్ దొనకించు గాలితుటుముల్ నేఁడిందు రా పాడెనే.
అను పద్యంలోని ఔచిత్యమును గురించి చర్చించుట కుద్దేశించినది. 5, 6 ఏండ్ల పిల్లవాడు పద్యమున చెప్పబడిన విధంగా అంత ప్రౌఢముగా మాట్లాడగలడా? ఇందులో ప్రకృత్యౌచిత్యమెంత ఉన్నది? అని ప్రశ్నించుకొని తిరుమలరావుగారు చార్లెస్ డికెన్స్ నవలలోని పసిపిల్లల మాటలను, మారిస్ మాటర్‌లింగ్ వ్రాసిన బ్లూబర్డ్ నాటకంలోని పసిబాలుని భరతవాక్యాన్ని, బాల ప్రహ్లాదుని మాటలను ఉదాహరించి ప్రకృత్యౌచిత్య మననేమో విపులంగా చర్చించి ఈ పద్యము ఆనందవర్థనుడు ధ్వాన్యాలోకమున చెప్పిన ప్రకృత్యౌచిత్య సిద్ధాంతమునకు ఉదాహరణ ప్రాయముగా నున్నదని, శివాజీ జననికై జన్మభూమిపై తననంకితము చేసికొను పత్రమునకు నాంది వంటిదని వివరించారు. ఒకే ఒక్క పద్యం విషయమై ఇంత విస్తృతంగా 30 పేజీలలో వివరణనివ్వటం ఆంధ్ర సాహిత్య విమర్శనమున అపూర్వ విషయము. నాటకీయ శిల్పము అనునది ఏడవ అధ్యాయము. 2389 పద్యములుగల శివభారతమున దాదాపు1400 పద్యములు సంభాషణాత్మకమైనవి కనుక శివభారతము శ్రవ్య కావ్యమనుట కంటె దృశ్య కావ్యమనుటయే సముచితముగా ఉండునని తిరుమల రావుగారి భావన.. తదనుగుణముగ, ఆలంకారిక మతానుసారముగా అందులో ప్రస్ఫుటమయ్యే నాటక లక్షణాలను విశదీకరించారు. ‘‘శివభారతము భారత దాస్య విమోచన నాటకము’ అని స్థాపించుటకు నాటక సంబంధ విషయాలైన పంచసంధులను, వీర, భయానక, రౌద్ర, శాంత, కరుణ, హాస్య రసాలను శివభారతమున నిరూపించి శివాజీని నాయకునిగా, భారతమాతను నాయకురాలిగా పేర్కొని ఇలా సమర్థించారు. ‘‘ఇతర నాటకములందు వలె కాక ఇచట నాయకురాలు యజమానురాలు. నాయకుడు సేవకుడు. నాయకురాలు తల్లి. నాయకుడు కొడుకు’’.
సాంకేతిక దృష్టిలో శ్రవ్య కావ్యమైన శివభారతమును దృశ్య కావ్యము అనగా నాటకముగా పరిగణించునట్లు చేసే అంశాలను ప్రధానంగా అందులోని సన్నివేశ శిల్పము, సంఘటనా శిల్పము, సంభాషణా శిల్పమును గూర్చి అనేక ఉదాహరణలను ఇచ్చి విస్తృతంగా చర్చించి థామస్ హర్డి వ్రాసిన ది డైనాస్ట్స్‌ను వలె శివభారతమును మనోరంగ ప్రయోగ యోగ్యమగు ఇతిహాస నాటకముగా పరిగణింపవలెను’’ అను తీర్పునిచ్చారు.
ఈ విధంగా అంతర్జాతీయ స్థాయి రచనతో ఒక తెలుగు కావ్యాన్ని పోల్చగల నేర్పరితనమలు, బుద్ధిమత్తత ఎందరు తెలుగు వాఙ్మయ విమర్శకులకున్నది?
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్