వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కావ్యములోను సాధారణ పాఠకులతోపాటు కొందరు పండితులకుకూడా కొరుకుడుపడని సుబోధకముగాని గ్రంథ గ్రంథులుండటం సహజం. శివభారతములోని గ్రంథ గ్రంథులు ఎనిమిదవ అధ్యాయములో వివరించబడినవి. ఈ వివరణలకు ముందుమాటగా తిరుమలరావుగారు వ్రాసిన వాక్యాలలో కొన్ని ఉదాహరించదగినవి ఇవి: ‘‘ఆవేశముతో ప్రకటించు శాంతమే కవిత్వము. కవి వాక్యము సామాన్య శబ్దములతో ఏర్పడినట్లు కనపడినను అసామాన్యార్థము కలిగియుండును. కావ్యము అర్ధసారళ్యము కలిగి ఉండకపోయినా సామాన్య ప్రజలు నిరాధారులయ్యెదరు. కవిత్వము అందరికి చదివినవెంటనే అర్థము అయి తీరవలెననుట కవికన్యాము చేయుట అగును. కవి స్థాయిని మనమందుకొనవలెను. కవి అనుసరింపని లక్షణములను సృష్టించు అలంకారికుని కన్న, కవి వ్రాసిన దానిని అర్థవంతంగా వ్యాఖ్యానించు వ్యాఖ్యాతయే సామాన్య ప్రజలకు సాహితీ బంధువు’’.
ఈ మాటలను వ్రాసి తగిన ఉదాహరణలనిచ్చిన తర్వాత శివభారతములోని ‘పెంచని కోతి’, ‘కంటినీట పగఱఁ గాల్పవలదె’, ‘మంగళ సూత్రమ్ము కాచికొనుము’, ‘నీ మాట నామాట’, ‘సహజవైరి’, ‘పులిపాలు’, ‘పడుచుఁబ్రాయంపు దెర’, ‘్భగవాజండా’, ‘మావచించిన దొసఁగు‘ఉత్సాహమలక్ష్మి’, ‘మబ్బులోనీర మురుము మెరుము’, ‘వ్రాత్యుడు’ తాంబూలములోని సున్నము వంటిదైన అదృష్టము వంటి పదాలను, పదబంధాలను గూర్చి తమ ప్రగాఢ విజ్ఞానబలంతో విస్తారంగా చర్చించారు.‘గో రక్ష’ అన్న 9వ అధ్యయములో గోహననము విషయమున 12 సమస్యలిమిడియున్నవని, శివభారతమున గోహనన సమస్యపై శివాజి కాలమునాటి పరిస్థితిని వర్ణించే ఘట్టాలలో గల కవిత్వంలోని శిల్పం, జాగరూకత, అంగాంగ సామరస్యం, నిర్మాణాత్మక, నిష్పక్షపాత బుద్ధి, ఆశాజనక వాతావరణం చిరస్మరణీయాలని ప్రకటించారు.
ఈ ఘట్టములలో శివభారత రచనలోని సూటిదనము అశోకుని శిలాశాసనములలో గల భాషా సారళ్యాన్ని తలపింపచేస్తుందని, ఇటువంటి రచనల వలననే చారిత్రక సాహిత్యం జాతి జీవన విమర్శనమని నిర్వచించవచ్చని ప్రశంసించారు.

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్