వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివభారతము తీర్చిన శివాజి, శివాజి తీర్చిన శివభారతము అన్న 10వ అధ్యాయము విశిష్టమైనది.
1963లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వారిచే ప్రకటించబడిన 1666 నాటి రాజస్థానీ లేఖలు అన్న గ్రంథంలో శివాజి ఇలా వర్ణింబడినాడు.‘‘చూచుటకు శివాజి పలుచగను, పొట్టిగను కన్పడును.
అతని మైచాయ అద్భుతమైన గౌరవర్ణము. అతడెవరయనది తెలయకుండగనే అతడు ‘ప్రజాపాలకుడ’ని స్పష్టమగును. అతని ధైర్య వీరముల సంగతి వేరుగ చెప్ప పనిలేదు. అతడు ఉదార హృదయుడగు మహామానవుడు. శివాజీకి గడ్డమున్నది’.ఈ లేఖలు ప్రచురించుటకు 23 సం.ల పూర్వము రచించబడిన శివభారతములో శివాజీ ఇలా వర్ణించబడ్డాడు.
‘‘మెఱుపుల వంటి చూపు నులిమీసల బుగ్గలనంటు గడ్డపుం
బరుజులు ముళ్ళకన్బొమలు పర్వగ జేగురుగొన్న మోముతో
దురగము నెక్కి నల్గడల దూఁకు మహారథు..’’
ఈ రెంటిని ఉదాహరించి తిరుమలరావుగారు కావ్య సత్యము, చరిత్ర సత్యము ఒకటిగ ఉన్నవని తేల్చిచెప్పటం వారి రచనకై చేసిన తపస్సును చెప్పకనే చెప్పుచున్నది.

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్