వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఘజీవిగ, కొడుకుగ, శిష్యునిగ, స్నేహితునిగ, భర్తగ, తండ్రిగ, విరోధిగ, నాయకునిగ, సేవకునిగ, శివాజి తన భూమికను నిర్వహించిన తీరును శివభారతము ఏ విధంగా చూపించినదో, శివాజీని దానవీరునిగా దయావీరునిగా, ధర్మవీరునిగా, యుద్ధవీరునిగా, అవికత్థనునిగా, సమచిత్తునిగా, స్థిరమతిగా, జీవకారుణ్యమూర్తిగా, అద్భుతంగా వివరించారు. శివాజీ లేనిదే శివభారతమే అంటే భారతదేశ క్షేమమే లేదని నొక్కిచెప్పారు. ఇందుకు శివభారత కావ్యానే్న కాక ప్రాచ్య పాశ్చాత్య కావ్యజాలాన్ని కూడా సునిశిత దృష్టితో పరిశీలించి తైపారు వేశారు.
శివాజి జీవితములోను, శివభారతములోను ముఖ్యురాలైన శివాజి తల్లి జీజియను కవి చిత్రీకరించిన విథాన విశే్లషణే 11వ అధ్యాయము. ‘జీజియ అలంకార మాల’ అనునది. జీజియ జీవితము మగని పక్షాన, తండ్రి పక్షాన, కొడుకు పక్షాన పోరాటమైనదని సోపపత్తికముగా ప్రకటించబడినది. జీజియను కవి ‘తొంటి సత్యభామ’గా, ‘కాత్యాయని’గా, ‘వాల్మీకి’ పదములంటి పనవుచున్న సీతను దలంపునకు తెచ్చునదిగా ‘కణ్వు చెంత శకుంతల’గా, ధేనువుగా ‘ద్రుపద తనయ’గా, ‘పండు’గా పోల్చుటలో కల ఔచిత్యమును నిరూపించి ఆమెను ‘సత్యసుందర శివభారతీయ గుణాలంకారమాల’గా తిరుమలరావు గారు అభివర్ణించారు. 12వది, చివరిది అయిన అధ్యాయము పేరు శివభారత దర్శనము. కావ్య ఇతివృత్తము ఉదాత్తమైనా కాకపోయినా కవి ప్రతిభను బట్టి కావ్యము ఉదాత్తము కావచ్చునని, లేదా నీరస రచన కావచ్చునని, ఇతివృత్తము, కావ్యము రెండు కూడా ఉదోత్తముగా ఉండటం ఆధునిక కాలంలోని గ్రంథాలలో ఆంగ్ల రచన ‘వార్ అండ్ పీస్’కు, ఆంధ్ర రచన శివభారతమునకు చెల్లినవని తిరుమలరావుగారు ప్రకటించటం విశేషం. రచన గొప్పదనానికి దాని పరిమాణం కారణం కాదని చెపుతూనే ప్రపంచ సాహిత్యంలోని గొప్ప రచనలన్నీ పెద్దగ్రంథములే అని శివభారతము పెద్ద గ్రంథమే అయినా దానిని మంగళాంతములగు చిన్న చిన్న ఖండ కావ్యములుగా ఎలా విభజించి పేర్లుంచవచ్చునో చూపించారు. ఆధునికాంధ్ర కవిత్వములో శివభారతము ఏవిధముగా విశిష్ట గ్రంథమో ఈ అధ్యాయంలో వివరించారు. ‘‘సంఘము, వ్యవస్థ, మతము, జాతి, దేశము, వర్గ సామరస్యము, సమష్టి ప్రయత్నమువంటి ఇతివృత్తములను నిర్మాణాత్మకముగ, బాధ్యతాయుతముగా, ఉదాత్తముగ చిత్రించిన కావ్యములు ప్రాచీన అధునాతన సాహిత్యములందరుదు. ఇరువదవ శతాబ్దములో ఒక నాటము, ఒక నవల, ఒక కావ్యమీపని చేసినవి. అవి కన్యాశుల్కము, మాలపల్లి, శివభారతము. జాతి సంస్కృతి కాలపట్టులయిన సజనాత్మక గ్రంథములిట్లే ఉండవలెను’’.

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్