వినమరుగైన

శివభారత దర్శనము (సర్దేశాయ తిరుమల రావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాసభారతానికి వాల్మీకి రామాయణానికి అనువాదాలో, అనుకరణలో, అనుసరణలో అయిన రచనలు గాజుపూసలని, జంబాల సదృశ చరిత్రనుండి రూపొందిన స్వతంత్ర కావ్యమైన శివభారతము పులుకడిగిన ముత్యమని తీర్పు చెప్పారు.
కష్టకాలంలో శివభారతము వంటి కావ్యాలు పాఠకులకు ఎంతో ధైర్యాన్నిచ్చి, కర్తవ్యాన్ని బోధించి తగిన సందేశంతో చేదు బ్రతుకును తీపిగ చేయగలవని ఇదే కవిత్వానికి ఆశయము, ప్రయోజనము అని ప్రకటించారు.
సాధులకు, పేదలకు ఎగ్గుచేసే దుర్వినీతులకగు భయము అయిన శివాజీ ‘‘ఆకులు అలములు గతుకుచు కొండలలో ఎండుచున్న మావళీలను మహావీరులుగా మార్చెను. సహజముగ సహృదయులే అయినను పరిస్థితుల బలిమివలన కశ్మల హృదయములైనవారిలో మంచితనమును మేల్కొలిపెను.
తులువలకు తగిన గడ్డి తినిపించెను. పిరికివారికి శౌర్యము పోసెను. భయపడినవారికి ధైర్యము తెచ్చెను. మనము పనికిమాలిన వారమని చేతులు కట్టుకొని మూలక్రుంగి ఉన్నవారు మనమును మొనగాండ్లమే అని ఛాతి విరుచుక తిరుగునట్లు చేసెను. తండ్రి ఒజ్జలు కలలు కనిన స్వతంత్ర మహారాష్టమ్రును స్థాపించెను. అన్నిటికంటె ముఖ్యముగ అమ్మ కన్నీరు తుడిచెను’’.
ఆ అమ్మ ఎవరు? అంటే భారతమాతే అని. ఇటువంటి ఉదాత్త చరిత్రుడు కథానాయకుడుగా గల శివభారతము సాహితీపరులకు చక్కని కవిత్వమును, ప్రజానీకానికి గంభీర సందేశాన్ని అందించిందని తమ శివభారత దర్శనాన్ని ముగించారు సర్దేశాయి తిరుమలరావుగారు.
తిరుమలరావుగారి రచన సంప్రదాయ కావ్య విమర్శనా గ్రంథాలకంటె భిన్నంగా సంపూర్ణ వౌలిక పరిశ్రమతో విశాల దృక్పథంతో విశ్వసాహిత్య స్పర్శతో రచించబడింది. కాళిదాసు రచనలను వ్యాఖ్యానించటానికి మల్లినాథసూరి లభించినట్లు గడియారం వేంకటశేష శాస్ర్తీగారి శివభారతమును విశే్లషించటానికి కవి హృదయ గతాభిప్రాయము కనుగొనుటకు విమర్శకుడింకొక కవి కావలసియుండును. ‘కవిత్వము వలె విమర్శనము సృజనాత్మకము’ అని ప్రకటించి తదనుగుణంగా శివభారత కవి హృదయపు లోతులను దర్శించి పాఠకులకు దర్శింపజేశారు సర్దేశాయి తిరుమలరావుగారు. ఈ రచన రసజ్ఞుల ధన్యవాదాలకు పాత్రమై, రేపటివారికి మార్గదర్శకమై నిలిచిపోతుంది.

-సంపూర్ణం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సూర్యదేవర రవికుమార్