వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపద గేయ సాహిత్య పరిశోధనలో చెప్పుకోదగిన కృషి చేసినవారిలో తానే ప్రథముడనని రామరాజుగారు చెప్పుకొన్న విషయం అక్షర సత్యం.
తాము సేకరించిన సాహిత్యాన్ని 16 ప్రకరణాలలో వివరించారు. జానపద గేయాల పుట్టుపూర్వోత్తరాలు, వాటి వ్యాప్తి, లక్షణాలు, శిష్ట సాహిత్యంలో జానపద గేయాల ప్రసక్తి మొదలైన అంశాల్ని ముందుగా చర్చించారు. అజ్ఞాత కర్తృత్వం జానపద గేయాల ప్రధాన లక్షణమని వీటికి నియమిత స్వరూపం ఉండదని, ఇవి ఆశు రచనలని, జన సామాన్య పరిచిత వస్తువులే గేయాలుగా ఉంటాయని, శృంగార, కరుణ రసాలు ఈ రచనల్లో ప్రధాన పాత్ర వహిస్తాయని వివరించారు.
రామరాజుగారి పరిశోధనా దృష్టి మిక్కిలి నిశితమైనది. ప్రతి ప్రకరణంలోను ఆయా అంశాల్ని చర్చించేటప్పుడు ఇచ్చిన పూర్వరంగపు విశేషాలు వీరి పాండిత్యానికి, పరిశోధనా పటిమకు తార్కాణంగా నిలుస్తాయి.
నన్నయ, ననె్నచోడుడు, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, అన్నమయ్య, కదిరీపతి, త్యాగయ్య మొదలైన కవులు, పదకర్తలు ప్రస్తావించిన జానపద గీతాలను గూర్చి ప్రస్తావించారు.
వీరి సాహిత్యంలో ఊయల పాటలు, రోకటి పాటలు, వెనె్నల పదాలు, తుమ్మెద పదాలు, జాజర పాటలు, మేలుకొలుపులు, నీరాజనాలు, ఏలలు, గొబ్బిపాటలు, లాలి జోలపాటలు ప్రసక్తులున్నాయని వివరంగా తెలిపారు.
జానపద సాహిత్య సేకరణలో బ్రౌన్, బోయల్ మొదలైన పాశ్చాత్యులు చేసిన కృషిని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ జానపద సాహిత్య సముద్ధరణకు కావించిన కృషిని తెలిపారు. తన కంఠ మాధుర్యంతో ఆకాశవాణి ద్వారా, వివిధ సభల్లో హాస్య ప్రసంగాల ద్వారా జానపద గేయాలకు విశేష ప్రచారాన్ని కలిగించిన శ్రీ ప్రయాగ నరసింహశాస్ర్తీగారు 40 గేయాలను తెలుగు పల్లె పాటలు పేరుతో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.
రామరాజుగారు తాము సేకరించిన జానపద గేయాలను పౌరాణికాలు, చారిత్రకాలు, మత సంబంధాలు, పారమార్థికాలు, స్ర్తిల పాటలు, శ్రామిక గేయాలు, పిల్లల పాటలు, శృంగార గేయాలు, అద్భుత గేయాలు, కరుణ రస గేయాలు, హాస్య సంబంధ గేయాలుగా విభజించారు.
పౌరాణిక గేయాలను రామాయణ, భారత, భాగవత సంబంధులుగా విభజించారు. రామాయణానికి సంబంధించి 100 గేయాలకు పైగా రామరాజుగారు సేకరించగలిగారు. దీనిని బట్టి పల్లె ప్రజల్లో రామాయణ కథ పొందిన ప్రచారాన్ని గుర్తించవచ్చు. కూచకొండ రామాయణం, శారద రామాయణం, ధర్మపురి రామాయణం మొదలైన రీతుల్లో రామాయణ కథ పూర్తిగా గానం చెయ్యబడుతుంది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

గుమ్మా సాంబశివరావు