వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంత కల్యాణం, సుందరకాండ, అంగద రాయబారం, లక్ష్మణమూర్ఛ, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు, శ్రీరామ పట్ట్భాషేకం మొదలైన అంశాలతోప్రత్యేక గేయాలున్నాయి. లక్ష్మణ దేవర నవ్వులో నిద్రాదేవిని గూర్చి రామునికి వివరిస్తూ లక్ష్మణుడు-
మాయన్న రఘుపతికి మా వదినకూనూ
ఈ పర్ణశాలకు తాను కాపనెనూ
పోపొమ్మయోధ్యాపురీ నగరకువేగా
ధవుని బాసీనట్టి సతియుండ తగదూ
రాత్రియను పవలును లేవకుండగనూ
తను విడిచి పొందుమీ ధవళాకి నిద్రా
అని బ్రతిమాలినట్లు చెప్పాడు. జానపదులు ఊర్మిళ నిద్రకు, లక్ష్మణుని నిద్రారాహిత్యానికి కల్పించిన కారణాన్ని గమనించినపుడు శిష్టకవులు సైతం వారిని అభినందించక తప్పదు. అందుకే రంగనాథ రామాయణంలో ఈ విషయం చేర్చబడింది.
భారతంలో ఘట్టాలను జానపదులు గేయాలుగా మలచుకొన్న తీరును కూడా రామరాజుగారు రమ్యమైన రీతిలో వివరించారు. నలచరిత్ర, సుభద్రా కల్యాణము, ధర్మరాజు జూదము, ద్రౌపది వల్వలు, కీచక వధ, విరాటపర్వము, విశ్వరూపము, సావిత్రి పాట, గయోపాఖ్యానము మొదలైన ఘట్టాలు గేయాలుగా కూర్చిన తీరును తెలియజేశారు. భాగవత సంబంధమైన గేయాల్లో శ్రీకృష్ణ జననం, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కల్యాణం, బాలకృష్ణ లీలలు, కుచేలోపాఖ్యానం, ఉషా స్వప్నం మొదలైన వాటిని వివరించారు.
వీరరస ప్రధానాలైన చారిత్రక గేయాలకున్న విశిష్ట స్థానాన్ని వివరించారు. సీతారామరాజు కథ, బొబ్బిలికథ, దేశింగురాజు కథ మొదలైన వాటిని ప్రస్తావిస్తూ, ప్రతి వీరగాథలో ఏదో ఒక నీతి ధ్వనిస్తూ ఉంటుందని తెలిపారు. మల్లారెడ్డి, సదాశివరెడ్డి, సర్వాయిపాపడు, బల్గూరి కొండల్రాయుడు మొదలైన స్థానిక వీరుల గాథల్ని వివరించారు. పలనాటి వీరగాథల్ని, కాటమరాజు కథల్ని విశేష రీతిలో విశే్లషించారు.
జన జీవన స్రవంతిలో మతానికున్నప్రాధాన్యం మరొకదానికి ఉండదన్న విషయం సత్యదూరం కాదు. రామరాజు గారు సేకరించి వివరించిన గేయాల్లో శైవ, వైష్ణవ మత సంబంధమైన గేయాలు దక్షయజ్ఞం, గంగా వివాహం, సవతుల కయ్యం, సిరియాళు కథ, వరదరాజు పెండ్లిపాట, ఆండాళ్ చరిత్రము, చిన్నమ్మ కథ మొదలైనవి పేర్కొనదగినవి. భగవదనుగ్రహం మీద విశ్వాసం వున్న జానపదులు సృష్టించుకొన్న పారమార్థిక గేయాలను కూడా వివరించారు. కేవలం మంగళహారతులకు సంబంధించిన గేయాలను రామరాజుగారు సుమారు 50 సేకరించారు. వేదాంత సంబంధమైన గేయాలలో రాజయోగం, గురుభక్తి, నీతిబోధ, సంఘ సంస్కార పరాయణత్వం, వర్ణాశ్రమాచార నిరసనం, సత్ప్రవర్తనం, అహింస మొదలైన విషయాలుంటాయని సోదాహరణంగా తెలిపారు.
స్ర్తిల పాటల్ని గూర్చి వివరిస్తూ రామరాజుగారు కవిత్వమనునది జానపదులకు సుఖమునకు దుఃఖమునకు వచ్చును. పుట్టుట గిట్టులు, వేడుకలు వినోదములు, పెండ్లి పేరంటములు, ఆదరింపులు, ఆరడులు, సత్కార తిరస్కారములు, మైత్రీ విరోధములు, శుభాశుభములు, ఆశా నిరాశలు, సుఖ దుఃఖములు సమస్తమును జానపదులకు కథావస్తువులైనవి. సంసార యాత్రలో గృహలక్ష్మికి గల ప్రాధాన్యము పురుషునకు లేదు. అటులే గృహ జీవనమున కవిత్వమునకు కూడా స్ర్తిలే అధికముగా నాలంబనములు. కనుకనే ఇట్టి భాగమునంతయు సౌలభ్యము కొరకు స్ర్తిల పాటలుగా విభజించుకొని పరిశీలించుట యుచితము’ అని తెలిపారు. జానపదుల కవిత్వంలో కల్పనకంటే వాస్తవికతకే ప్రాధాన్యం అధికంగా ఉంటుందని చెప్పారు. లాలి, జోల, పెళ్లి, గంధం పాటలు, కొట్నాల పాటలు, బంతులాట పాటలు, నలుగు పాటలు, తలుపు దగ్గర పాటలు, అప్పగింతల పాటలు మొదలైనరీతిలో స్ర్తిల పాటలు పలు విధాలుగా ఉంటాయని తెలిపారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

గుమ్మా సాంబశివరావు