వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపద గేయాల్లో ప్రముఖ స్థానం ఆక్రమించుకొనేవి శ్రామిక గేయాలు. జానపదులు శ్రమించేటప్పుడు తమ కష్టాల్ని, శారీరక శ్రమల్ని మర్చిపోవటానికి అప్రయత్నంగా కూనిరాగాలు తీస్తారు. ఆ రాగాలతో కూడిన మాటలే జానపద గేయాలుగా పరిణమిస్తాయి. ఇల్లు అలికేటప్పుడో, పిండి విసిరేటప్పుడో, ధాన్యం దంచేటప్పుడో, మజ్జిగ చిలికేటప్పుడో, నాగలితో దునే్నటప్పుడో, నారు తీసేటప్పుడో, నాట్లు వేసేటప్పుతో, కోత కోసేటప్పుడో, కుప్ప నూర్చేటప్పుడో శారీరక శ్రమను తొలగించుకోవటానికి పాటలు పాడుతారు.
ఈ గేయాల్లో స్థానిక వృత్తాంతాలు, భక్తిగేయాలు, శృంగార గీతాలు ఉంటాయి. ఈ గీతాలనెన్నింటినో సేకరించి, విశే్లషించి రామరాజుగారు వివరించారు.
బాల్యం మానవ జీవితంలో ఒక మధుర ఘట్టం. ఆటపాటలతో, బాధ్యతలు లేకుండా అరమరికలు లేకుండా సాగే బాల్య జీవితం బంగారుమయం. పిల్లల పాటలు రెండు రకాలుగా ఉంటాయని పిల్లలకోసం పెద్దలు రచించినవి, పిల్లలచేతనే రచించబడి ప్రచారం పొందేవి అని తెలిపారు. లాలి, జోల, ఉగ్గుపాటలతో పాటు తల్లిదండ్రులు తమ పిల్లలకు భక్తి, నీతి, వినయం, విజ్ఞానం కలిగిన పాటల్ని నేర్పుతారని చెప్పారు.
పిల్లలు పెద్దల్ని అనుకరిస్తూ సొంత రచనలు చేస్తారు. పిల్లల పాటల్లో కాళ్లాగజ్జె కంకాళమ్మ, ఒప్పుల కుప్పా వయ్యరిభామ, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ మొదలైన పాటలతో పాటు పొడుపు కథలు దసరా పాటలు ప్రసిద్ధమైనవని రామరాజుగారు తెలియజేశారు.
జానపదుల గేయాల్లో శృంగారానికే అగ్రస్థానం ఉన్నదని రామరాజుగారు అనేక గేయాల్ని వివరిస్తూ తెలిపారు. అన్ని రకాల జానపద గేయాల్లోను శృంగారం ఉన్నదని, ఇది సంయోగ, వియోగరూపాల్లో ఉన్నదని వివరించారు. ప్రేమికుల స్నేహం, వారు కలిసిమెలిసి తిరగటంలోని ఆనందం ఒక గేయంలో మనోహరంగా ఉన్నదని, ఈ గేయం జానపదుల కవితాత్మక దృష్టికి నిదర్శనమని తెలుపుతూ-
ఉల్లిపూల పడవగట్టి-
మల్లెరేకుల తెరను దించి
నాగులేటి వాగులోన మామ- తేలిపోదామ
మొగిలిపూల తేరు గట్టి
మొగిలి రేకుల గొడుగుపట్టి
మొగులు మేసే కొండమీద మామ
ముద్దుగా ఎళ్లుదామా
అనే గేయాన్ని ఉదాహరించారు. ఇక్కడ మొగలు మేసేకొండ అనడంలో, మేఘాలతో కప్పబడిన కొండ అని చెప్పకనే చెప్పడంలో జానపదుల ఊహాశక్తి స్పష్టమవుతుంది. సారంగధర చరిత్ర గేయంలో ఉన్న ఏకత్రైవానురాగాన్ని కూడా వివరించి ఇక్కడ తుచ్ఛ శృంగార భావాలున్నాయని విదితం చేశారు.
జానపదులకు అద్భుత రసాభినివేశం అధికం. ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఆకర్షకంగా ఉంటాయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

గుమ్మా సాంబశివరావు