వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యంగా పిల్లలు ఇలాంటి విషయాలపట్ల ఉత్సుకతను ప్రదర్శిస్తారు. జానపద గేయాల్లో, కథల్లో దేవతలుగాని, మంత్రదండంగానీ, పావుకోళ్ళు గానీ, సంచిగానీ, భూతద్దంగానీ ప్రముఖ పాత్ర వహించటం జరుగుతుంది. వీటి అద్భుతాలు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటాయి. అద్భుత కథల్లో బాగా ప్రచారం పొందిన కథ బాలనాగమ్మ కథ. దీనితోపాటు గాంధారి కథ, కాంభోజరాజ కథ మొదలైనవి కూడా అద్భుత రసాత్మకాలని తెలిపారు.
జానపదులు శృంగారం తర్వాత కరుణ రసానికి ప్రాధాన్యమిచ్చారని రామరాజు గారు తెలియజేశారు. నిత్య జీవితంలో సుఖం కంటే దుఃఖమే అధికం కావటంవల్ల జానపదులు దుఃఖమయమైన సంఘటనల్ని సహజంగా చిత్రించగలిగారని చెప్పారు. అత్తపెట్టిన ఆరడివల్లనో, కట్టుకున్న భర్త చేసిన అత్యాచారంవల్లనో, తోడికోడళ్ళ అసూయ చేతనో, ఇరుగు పొరుగుల దౌష్ట్యంవల్లనో, దైవ దుర్విపాకమువల్లనో, ఇడుముల పాలైన స్ర్తిల కథలు జానపద వాఙ్మయ సముద్రములోని కన్నీటి కెరటాలు. జరిగిన విషాద గాథలకు జానపదులు కొంత మహాత్మ్యము చేర్చుతారని కరుణ రస గేయాలను గూర్చి వివరించారు.
కరుణ రస పూర్తిగాథల్లో కన్యకామ్మవారి కథ బాగా ప్రచారం పొందినదని, ఈ కథనే గురజాడవారు కన్యక గేయంగా రచించారని చెప్పారు. కన్యక చరిత్ర ఆధారంగా పాటలు, దండకాలు, మంగళహారతులు, గొబ్బిపాటలు వెలువడ్డాయని తెలిపారు. ఇంకా కామమ్మ కథ, లక్ష్మమ్మ కథ, సారంగధర చరిత్ర, తిరుపతమ్మ కథ మొదలైన కరుణ రసాత్మకమైన కథల్ని వివరించారు. ‘జీవితం దుఃఖమయం కాబట్టి ఏడుపు తప్పదు. తాత్కాలికంగానైనా ఏడ్పును తొలగించి దుర్భర జీవితాన్ని కొంత సుగమనం చేసి మనస్సును సుప్రసన్నం చేసి జీవితాన్ని పెంచేది నవ్వు’ అని హాస్యపు పాటల్ని వివరించేటప్పుడు తెలిపారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

గుమ్మా సాంబశివరావు