వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపదుల భాషలో ఉండే నానుడులు, సామెతలు, జాతీయాలు మొదలైన వాటిని తెలిపారు. జానపద గేయాల్లో ప్రసక్తమైన జానపదుల ఆచార వ్యవహారాలు, వృత్తులు, కళలు, వినోద విజ్ఞానాలను గూర్చి వివరించారు. జానపద గేయాలలో సంగీతపు వరుసల్ని గూర్చి పరిశీలించారు. జానపద భిక్షుకులు జానపద గేయ సంరక్షకులని, జానపద గేయాలు భిక్షుల పాలిట కల్పవృక్షాలని తెలిపి పిచ్చుగుంట్లు, శారదకొండ్రు, వీరముష్టివారు, బవనీలు, బీరన్నలు మొదలైన జానపద భిక్షుక గాయకుల్ని వివరించారు. రామరాజుగారి జానపద గేయ సాహిత్యం తెలుగు జానపద గేయ సాహిత్య విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. జానపద ప్రక్రియలో పరిశోధన కోసం సమర్పించబడిన మొట్టమొదటి గ్రంథమిది. ఈ గ్రంథంలోని ప్రతి ప్రకరణమూ తర్వాతి కాలంలో పరిశోధనాంశంగా సమర్పించబడింది.
రామరాజుగారి స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయం జానపద సాహిత్య పరిశోధనలో, బోధనలో ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఆచార్య నాయని కృష్ణకుమారిగారు, ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావుగారు, ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద సాహిత్య పరిశీలనం చేసినవారిలో ప్రముఖులు. ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య ఎస్.గంగప్ప మొదలైన వారు జానపద గేయ సేకరణ వివరణల్లో ప్రసిద్ధి పొందారు.
ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో సంస్థలు కలిసి చెయ్యవలసిన పనిని రామరాజుగారు ఒక్కరే చేశారని చెప్పటం సహజోక్తి. ప్రచురణకు నోచుకోని గేయాలెన్నో ఇంకా వారి వద్ద ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రచురించి సహృదయ లోకానికి అందించవలసిన బాధ్యత ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలమీద ఉన్నది. తెలుగు విశ్వవిద్యాలయంలో నెలకొల్పబడిన జానపద కళల శాఖ ఈ దిశలో కృషి చెయ్యవలసి వున్నది.
తరతరాల జాతి జీవన స్రవంతికి దర్పణాలు జానపద గేయాలు కాబట్టి వాటిని సేకరించి భద్రపరచుకోవలసిన కర్తవ్యం ప్రతి ఒక్కరిదీనని భావించాలి. రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధక పితామహులు. వారి స్ఫూర్తితో జానపద సాహిత్య పరిరక్షణకు దీక్ష పూనవలసిన సమయం ఆసన్నమైనదని సాహిత్యాభిమానులు గుర్తించాలి. జానపద వాఙ్మయ సముద్రంలో రామరాజుగారి తెలుగు జానపద గేయ సాహిత్యం అనే గ్రంథం ఒక ఉత్తుంగ తరంగం.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

గుమ్మా సాంబశివరావు