వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథకు అలాంటి శీర్షికాస్థానం ఇవ్వకపోయినా ఉపేక్షించడంవల్ల మాత్రం కాదని గ్రహించాలి మనం. కొడాలి, పఠాభి శ్రీపాద వ్యాసరాజ్యంలో ప్రత్యేక పీఠాల అలంకరించారు.
ఈ నేపథ్యంలో మనమిప్పుడు అర్థశతాబ్దపు ఆంధ్ర కవిత్వాన్ని ఆ.ఆ అని వ్యవహరించుకోవచ్చు. నిజంగా ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకిది అ ఆలను నేర్పుతోంది. అయితే ఆ.ఆలో కవిత్వ చరిత్రే ఊపిరి పీల్చుకున్నదనీ తతిమ్మా ప్రక్రియలతో దానికి సంబంధం లేదనీ గుర్తుంచుకోవాలి మనం.
నవ్య, ఆధునిక అనే రెండు పరిభాషల్ని శ్రీపాద భిన్నగతుల్లో సందర్భాల్లో వాడి స్పష్టతను కష్టరహితంగా సాధించారు. రచయిత పాండిత్య ప్రకటనానికి కాక చదువరి ఆనందానికి దారి చేసేటట్టు రచించతమూ చదువరి మెప్పుకోసము కాక అతని అనుభవానికి దోహదము చేసేటట్లు రచించడమూ ఆధునిక కవిత్వాశయము (109పే) అని తేల్చి చెప్పారు శ్రీపాద. 1925 ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు ఆధునిక కవిత్వాన్ని హేళన చేశాయి. సాహిత్య చరిత్రను బోధించే ఆచార్యులు ఆధునికత క్షీణయుగంమీద తిరుగుబాటు మాత్రమే అని ముగించేవారు. రాధాకృష్ణన్ వంటి సరసులు ఆధునికతను గురించి మీమాంస లేవనెత్తారు. ఆ పరిస్థితుల్లో శ్రీపాదయే నిలబడ్డారు. అందుకే వారు ఈ జవాబును ప్రతిపక్షుల మీదికి విసిరారు.
ఆ దృష్టితోనే ఆధునికులలో నవ్వుడు శ్రీశ్రీ (137-148 పే) అని మరో వ్యాసం రాశారు. శ్రీపాద దృష్టిలో శ్రీశ్రీ తరవాత నవ్యాధునికులు మొదలయ్యారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం

మిరియాల రామకృష్ణ