వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదికగా ప్రతిభ పత్రిక సాక్షాత్కరించింది. కవులకు కొత్త రెక్కలు వచ్చాయి. ఈ సంగతుల్ని శ్రీపాద ముచ్చటించారు 121వ పేజీలో.
మరోపక్క భారతి ద్వారా ఆ రోజుల్లో కొత్త గొంతులు భావకవులకు భిన్నంగా వినిపించసాగాయి. శ్రీపాద ఆ కవులను గుర్తుపడుతూ వారిలోంచే జాషువాను చూశారు. సాహితీ సమితి తరువాతి నవకవులు అన్న వ్యాసంలో జాషువ ఆధునికత్వమేమిటని పరిశీలించారు. స్వానుభవ చైతన్యం ప్రతిబింబిస్తున్న రచన జాషువాదన్నారు. వస్తుశక్తివల్ల చదువురుల్ని పలకరించగల కొత్తదనాన్ని జాషువాలో పట్టిపట్టి చూశారు(129పే).
భావకవిత్వం మీద ఉమాకాంతంగారి విమర్శకు జవాబు చెప్పడంతో భావకవుల్ని వెనకేసుకురాలేదు శ్రీపాద. భావకవుల్లో ఉన్న గుణ లోపాలను పరిశీలించి నిగ్గుదేల్చడానికి అని రాసిన రెండు వ్యాసాల్లో కృష్ణశాస్ర్తీగారి గురించి ఒకటీ, వేదులా శివశంకరులు గురించి ఒకటీ ఉన్నాయి.
వివాదం వచ్చిన కవిత్వానికాయుర్దాయం పెరుగుతూ వుంటుంది. యెంకి పాటల విషయంలో అదే జరిగింది. గురజాడ భాషలో ఇచ్చిన చొరవను నండూరి ఇంకా ముందుకు తీసుకెళ్లి యాసకు పట్టం కట్టడంవల్ల భాష చెడిపోతోందనే భయం నీడలా లోకంలో అల్లుకుంది. యెంకి పాటల్లో కవిత్వముంది. చిక్కని ప్రేమ ఉంది. పాత్రకు జీవముంది. అందుకే ఈ పాటలను శ్రీపాద నెత్తికెత్తుకుని మోసి పరిశీలించి నిగ్గుతేల్చడానికి పూనుకుని అద్భుత ఫణితిలో రాశారో వ్యాసాన్ని. శ్రీపాద పలుకునే విందాం: చిరంతనమైన పదరచనా పద్ధతీ ఖండకావ్య నిర్మాణ తంత్రమూ దాంపత్య ప్రేమాకర్షకుల భాష చేరి నండూరివారి యెంకిపాటలుగా రూపొందినవి.
అంతకుముందు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక యెంకిపాటల్ని అనర్థక వాఙ్మయం అనే ముద్రవేసి మందలించడం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి మనం. అది యెంకిపాటల గాలి దుమారం అన్న పేర చెలామణి అయింది కూడా. సీతమ్మకు సంస్కృత కవులు ఇవ్వలేకపోయిన సుధామధుర భావాన్ని ఈ తెలుగు కవి యెంకికి ఇచ్చారు అని కితాబిచ్చిన మన కవిత్వం ఈ పాటలతో వ్యుత్పత్తి మీద నుంచి దిగి ప్రతిభను అధిష్ఠించింది సుమా అని గుర్తుచేశారు శ్రీపాద.
ఆధునిక కవిత్వాన్ని తొలిదశలో సమాంతరంగా ఇద్దరు రాస్తూ వచ్చారని పరిశోధకులంటారు. గురజాడ కేవలం కవి కాదు. ఆయన అనేక ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన ఆధునికతా మూర్తి. సమాంతరంగా వచ్చిన కేవల కవి రాయప్రోలువారు. ఈ ఇద్దరినీ పరిశీలించడంలో శ్రీపాద నిశిత విమర్శ చేశారు. ఒక్కమాట విందాం: గురజాడ తేటమాటల రచన వైపు కాక రాయప్రోలువారి అర్థ సంస్కృత రచనా పాటవమే కవులను ఎక్కువగా ఆకర్షించింది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం