వినమరుగైన

అక్షర తూణీరం (కె. వి. రమణారెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరతూణీరం అనే ఈ రచనలో అడుగడుగునా కన్పించే లక్షణం సాహిత్య విమర్శ పట్ల విశాల వైఖరి. కెవిఆర్ చాలా స్పష్టంగానే ఎలియట్‌లాంటివాళ్ళే సాహిత్య విమర్శలో వివాదాల వైఖరి చూపిస్తూ వుంటే మార్క్సిజాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో వున్నవాళ్లు మరింత లోతులకు వెళ్లగలగాలనే సూచన చేశారు. ‘తర్కశాస్త్రంలో ఇండక్టివ్, డిడక్టివ్ పద్ధతుల మధ్య పోలిక చెప్పి సాహిత్య విమర్శ క్రమబద్ధం కావాలంటే ఇండక్షన్ పద్ధతినే అనుసరించాలని ప్రతిపాదించారు. ఒక రచనలోని విశేషాలను గమనించి వాటిలో అత్యధిక భాగం సూచించిందేమిటో తెలుసుకుని దాని ఆధారంగా ఒక సామాన్య సూత్రీకరణ చేయాలి తప్ప ముందుగానే ఒక ఊహా సిద్ధాంతాన్ని స్థాపించుకుని రచనని చూడటంవల్ల రచయితకు అన్యాయం జరుగుతుందని కెవిఆర్ ప్రకటించారు. సామాజిక శాస్త్ర ప్రాతిపదికతో విమర్శ రాసేవాళ్లలో కూడా చాలామంది నైతిక విషయాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ సందర్భాలలో శుద్ధ సంప్రదాయవాదుల్లా మారిపోయి మనిషి శాస్తబ్రద్ధంగా నడిచే యంత్రంలాగా చూసిన సంఘటనలు ఆధునిక సాహిత్య చరిత్రలో కోకొల్లలు. అయితే అక్షర తూణీరంలోని కెవిఆర్ వ్యాసాలు అందుకు భిన్నంగా వుంటాయి. వ్యభిచారమనే ఒకానొక నైతిక అతిక్రమణని కేవలం తిరస్కార దృష్టితో చూడటంకాక, పొందికలేని వర్తమాన సాంఘిక వ్యవస్థమీద తిరుగుబాటుగా దాన్ని గుర్తించారు కెవిఆర్. మహీధర రామమోహనరావు నవలలమీద వచ్చిన విమర్శకి సమాధానంగా రాసిన వ్యాసం లో ఈ పై అంశాలతోపాటు నవలల్లో పాత్ర చిత్రణ గురించిన అనేక విలువైన అభిప్రాయాలు కనిపిస్తాయి. స్వగతాలు, సంభాషణలే కాక ఉపన్యాసాలు కూడా ఎలా కథావాహనాలౌతున్నాయో రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ ఆరు సారా కథలు మీద రాసిన వ్యాసంలో చాలా స్పష్టంగా విశే్లషించారు కెవిఆర్. అక్షరతూణీరంలో వున్న ప్రముఖ వ్యాసాలలో ఒకటిగా ఆరుద్ర గురించి రాసిన వ్యాసాన్ని చెప్పుకోవచ్చు. ఆరుద్ర మీద ఈ వ్యాసంలో చాలా నిష్పాక్షికమైన విమర్శ రాశారు. ముఖ్యంగా ఆరుద్ర త్వమేవాహంమీద కెవిఆర్ విశే్లషణ చాలా శక్తివంతమైంది. కెవిఆర్ దృష్టిలో త్వమేవాహం తెలంగాణ చరిత్రని పట్టించుకోవడం కంటే వర్తమాన జీవిత దృశ్యంమీద ఎక్కువ దృష్టిని నిలిపిందనీ, అదొక జీవిత భాష్యం, నిర్వేద పవనం అనీ అంటారు.

సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

బి. తిరుపతిరావు