వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ పునరుజ్జీవం, సామాజిక పునర్నిర్మాణం వంటి భావనలు ఆలోచింపజేశాయి. జీవితానుభవాలు, అవసరాలకు తోడు ఇంగ్లీష్ వారి సాంఘిక, సాంస్కృతిక ప్రభావం కూడా ఇందుకు ప్రేరేపించింది. తరతరాలుగా పాతుకుపోయిన సాంఘిక దురాచారాలు మేధావులను, ఆలోచనాపరులను కలవరపరచాయి.
ఈ నేపథ్యంలోనే వీరేశలింగం ఉద్యమించారు. ఆయన జన్మించడానికి పాతికేళ్లముందు వరకు చెదరుమదురుగానైనా సతీసహగమనం వంటి దురాచారం ఇక్కడా ఉండేది. అక్షరాస్యత చాలా తక్కువ. పాత సామాజిక వ్యవస్థ శిథిలమవుతున్నా కూడా కొత్తది రూపం దాల్చలేదు. సంఘజీవనంలో అజ్ఞానం, ఆరోగ్యం, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. తరచు కరువు కాటకాలు, తుపానులు, గాలివానలు వంటివి ప్రజల జీవితాన్ని కడగండ్లు పాలు చేస్తున్నాయి. వాన కురిస్తేనే పంట. ప్రయాణ సాధనాలు నామమాత్రం. ఇలాంటి స్థితిలో ప్రజల అజ్ఞానం, భయభీతులు, దైన్యం వగైరాలను ఆసరా చేసుకుని క్షుద్రశక్తులు, మూఢ నమ్మకాలు వెర్రితలలు వేస్తున్న దశ. వీటికి అందరికంటే ఎక్కువగా బలైనవారు స్ర్తిలు. అందులోనూ బాలవితంతువులు! 1901లో దేశంలో పాతికేళ్లలోపు బాలవితంతువులు 12 లక్షలమంది వున్నట్లు జనాభా లెక్కలు చెప్పాయి. ఆడపిల్లలు చదువుకోకూడదు. వారికి లోకజ్ఞానం వుండకూడదు. బాల్య వివాహాలు, పురుషులకు నాలుగైదు పెళ్లిళ్లు, బాలవితంతువులు మాత్రం గొడ్డుచాకిరీలోనే జీవితం చాలించాలి.
ఇలాంటి పరిస్థితులలో పుట్టిన వాటిని మార్చడానికి నడుం కట్టి, దేశానికే ఆదర్శం చూపిన ధీశాలి కందుకూరి. తన జీవితానుభవాలను, అభిప్రాయాలను స్వీయ చరిత్రగా గ్రంథస్తం చేయడం తెలుగువారి మహద్భాగ్యం. ఆ మహావ్యక్తి ఆలోచనలతో, దృష్టికోణంలో ఆయన జీవితాన్ని, నాటి కాలాన్ని సందర్శించగలగడం ఒక అపూర్వ అనుభవం. నిజానికి వీరేశలింగం స్వీయ చరిత్ర 19-20 శతాబ్దాల మధ్యకాలపు మూడు తరాల తెలుగువారి సాంఘిక చరిత్ర.

- ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి