వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన గురించి అమూల్యమైన పరిశోధన చేసిన అక్కిరాజు రమాపతిరావు గారన్నట్లు4రాజారామ్ మోహనరాయ్‌కి మహాత్మాగాంధీకి మధ్యకాలపు తెలుగుదేశపు సాంఘిక, సాహిత్య వైద్యా వైజ్ఞానిక రంగాల చరిత్ర. ఆనాటి సంధియుగంలోని సమాజం, న్యాయస్థానాలు, పాఠశాలలు, కులాచారాలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగస్తుల నడవడులు, స్థానిక సంస్థల నిర్వహణ, యువతరానికి, పెద్దలకు సంభవించిన భారీ సంఘర్షణలు ఇవన్నీ వీరేశలింగం స్వీయ చరిత్ర ఆధారంగా అధ్యయనం చేయవచ్చు. ఇంకో విశేషమేమిటంటే తెలుగులో సంపూర్ణమైన అర్థంలో తొలి స్వీయ చరిత్ర కూడా ఇదే కావడం!
తెలుగులో మొదటి ప్రబంధమును నేనే చేసితిని. మొదటి నాటకమును నేను తెనిగించితిని. మొదటి ప్రకృతి శాస్తమ్రును నేనే రచించితిని. మొదటి ప్రహసనము నేనే వ్రాసితిని. మొదటి చరిత్రమును నేనే విరచించితిని. స్ర్తిలకై మొదటి వచన పుస్తకమును నేనే కావించితిని’’ అంటూ స్వీయ చరిత్రలో రాసుకున్న కందుకూరి ఆ ప్రక్రియకు కూడా ఆద్యులు అనడం అక్షరసత్యం.
నిజానికి పంతులుగారికి స్వీయచరిత్ర రాసుకోవడం పెద్దగా ఇష్టం లేదు. ‘‘పనిచేసి చూపవలయునన్న చింతయేకాని నన్నుగూర్చి నేను చెప్పుకోవలయునన్న అభిలాష మొదటినుండియు నాకెందుకో లేకుండెను’’ అని ఆయన అవతారికలో మొదటి వాక్యంగా రాసుకున్నారు. అయితే ఆయన ఆదర్శ జీవితానుభవాలు గ్రంథస్థం కావాలనే ఆకాంక్షతో ఆత్మీయులు, అభిమానులు ఆ పని చేయమంటూ పంతులుగారిపై ఒత్తిడి తెస్తుండేవారు. అత్యంత ఆప్తమిత్రుడైన బసవరాజు గవర్రాజు ఇంగ్లీషులో కందుకూరి జీవిత చరిత్ర రాయాలని సంకల్పించగా ఆయన నిరుత్సాహపరిచి కావలెనంటే తన మరణానంతరం రాయమన్నారు. అయితే ఆయన కంటే చిన్నవాడే అయిన గవర్రాజు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందారు. అప్పుడు పంతులుగారే గవర్రాజు జీవిత చరిత్ర రాయాల్సి వచ్చింది. ఆ క్రమంలో స్వీయ చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈలోగా అభిమానులు తమకు తోచినట్లు రాయడం మొదలుపెట్టారు. రెండు భాగాలుగా పూర్తిచేశారు. 1911లో మొదటి భాగం అచ్చేయ్యేలోగా సహధర్మచారిణి రాజ్యలక్షమ్మగారు కన్నుమూశారు. జీవితాంతం అన్ని మలుపుల్లో మహత్కార్యాల్లో తనతో నిలిచిన భార్య మరణం ఆయనను ఎంతో కృంగదీసింది. ‘‘ఏబది సంవత్సరముల కాలము ప్రాణమునకు ప్రాణమైయుండిన నా అర్థాంగి లక్ష్మియైన రాజ్యలక్ష్మికి దీనిని నేనంకితము చేయుచున్నాడ’’నని ఆయన రాశారు.
అదృష్టవశాత్తు ఈ అంకిత వాక్యాలు చాలా సంవత్సరాలకు బయటపడి 1892లో విశాలాంధ్ర ప్రచురించిన స్వీయ చరిత్ర ముద్రణలో చోటుచేసుకున్నాయి.
కొమర్రాజు లక్ష్మణరావుగారి విజ్ఞాన చంద్రికా గ్రంథమందలి 1919లో రెండు భాగాలుగా స్వీయ చరిత్ర ముద్రించింది. హితకారిణీ సమాజంవారు 1954లో, 1963లో రెండుసార్లు పునర్ముద్రించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- ఇంకా ఉంది

తెలకపల్లి రవి