వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రసిద్ధకవి, రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు 1936లో రెండవ ముద్రణకు పీఠిక రాస్తూ, తన హోదాను ‘వీరేశలింగ మహాశయుని శిష్య పరమాణువు’ అని రాసుకవోడం ఆ గురుశిష్యులిద్దరి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. హితకారిణీ తరఫునే స్వీయ చరిత్రను సంగ్రహ ముద్రణ వెలువడింది. 1971లో నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు కూడా సంగ్రహ ముద్రణ వెలువరించారు. 1982లో విశాలాంధ్రవారు అక్కిరాజు రమాపతిరావు సంపాదకత్వంలో అధోజ్ఞాపికలు, వివరాలతో సహాస్వీయ చరిత్ర సంపూర్ణ పాఠం పునర్ముద్రించారు.
చెట్లులేని చోట ఆముదం చెట్లు మహావృక్షమన్నట్లు తాను కొంత కృషి చేశానని పుస్తకం పొడుగునా ఎన్నిసార్లు సవినయంగా చెప్పుకున్నా పంతులుగారు తెలుగులో స్వీయ చరిత్ర తనదే ప్రథమం అంటూ అందులోని కష్టనష్టాలను ప్రస్తావించారు. ఆత్మస్తుతి, పరనింద లేకుండా రాయటం, రాసినట్లు పాఠకులను ఒప్పించటంలో ఇబ్బందిని వివరిస్తారు.
పావన గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం తరతరాల చరిత్రకు సాక్షీభూతమైంది. కళాసాహిత్యాలనూ ప్రవహింపజేసింది. ఆంధ్ర మహాభారతానికి అక్కడే అంకురార్పణ జరిగింది. అలాంటి చోటు కందుకూరి వీరేశలింగం సంస్కారక్షేత్రం కావడం యాదృచ్ఛికం కాదు. తాత వీరేశలింగమే గొప్ప వ్యవహర్త. ఎన్నో ఉన్నతోదోగ్యాలు నిర్వహించిన వ్యక్తి. రాజమండ్రిలో లంకంత ఇల్లు కట్టాడు. వీరశైవుడైనప్పటికీ మెడలో లింగాకృతులు కట్టుకోకుండా కొద్దిపాటి సంస్కరణ దృష్టి ప్రదర్శించినవాడు ఆయన. రెండో కొడుకు సుబ్బరాయుడుకు - పున్నమ్మకు 1848లో ఏప్రిల్ 16న పుట్టిన బిడ్డే వీరేశలింగం. పుట్టినప్పటినుంచి జబ్బులు ఆయనను వెన్నాడాయట. ప్రాణాలు పోతాయని దాదాపు బయటపెట్టిన సందర్భాలూ వున్నాయి. అయినా మతాచారాలను తుదముట్టించే కర్తవ్య నిర్వహణకు ఆయన మృత్యుంజయడై బయటపడ్డాడు! చనిపోయేవరకు సాంఘిక దురాచారాలతోనేగాక శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూ వచ్చాడు. నాలుగో ఏటనే తండ్రిని కోల్పోయినా పెత్తండ్రి సాయంతో, తల్లి నీడలో పెరిగాడు. చిన్నప్పుడే పాఠాలు, శతకాలు బాగా వంటపట్టించుకన్నాడు. అన్నట్లు ఆ రోజుల్లోనే తమ పంతులుగారిని అనుకరించి, ముక్కుతో మాట్లాడటం నేర్చుకున్నాడు. ఈ దురలవాటు జీవితాంతం తనను వదలిపెట్టలేదని ఆత్మకథలో వాపోయారు. ఆయన విద్యార్థిదశలో కొన్ని ఘట్టాలు ఎంతో ఆసక్తి కలిగించడమేగాక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజెప్పాయి.
వసుచరిత్ర చదవాలనే కుతూహలంతో ఆయన పుస్తకాల షాపు యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. తల్లి స్కూలు ఫీజు కోసం ఇచ్చే డబ్బు ఆయనకు ఇస్తే ధర పూర్తిగా చెల్లించేవరకు అక్కడే వుండి, చదువుకోవడం ఆ ఒప్పందం సారాంశం. కొడుకు బడి మానేసి అలా చదువుకుంటూన్న విషయం ఎలాగో తల్లికి తెలిసింది. ఆయన పఠనాభిలాషకు సంతోషించి పుస్తకం కొనిపెట్టింది. ఏకసంథాగ్రాహి కావడంతో ఆయనకు పాఠాలు త్వరగా వచ్చేవి. అయితే ఆ లక్షణమే తనను కొంత చెడగొట్టిందని ఆయన రాసుకున్నారు. ప్రతిభ వుందని మరింత కష్టపడకుండా వుండటం కంటే ఎక్కువగా కష్టపడేవారే లోకానికి మేలు చేస్తారని అంటారు.

- ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి