వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థి దశలో ఆయన అసమర్థుడైన ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా పోరాడి, వెనక్కు పంపించారు. చదువులలో ప్రతిసారీ ప్రథములుగా వచ్చి అనేక ప్రశంసలు, సహాయాలు అందుకున్నారు.
జ్యోతిష్యాలు, ముహూర్తాలపై, భూతవైద్యులు, దయ్యాలపైన ఆయనమొదటే విశ్వాసంపోగొట్టుకుని, అవన్నీ బూటకమని గ్రహించారు. బ్రహ్మసమాజ ఆచార్య త్రయంలో ముఖ్యులైన కేశవ చంద్రసేన్ రచనలు వీరేశలింగంగారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. మిత్రులతోకలిసి సమావేశాలు జరుపుతూ నూతన విషయాలు చర్చించడం మొదలుపెట్టారు. తాము వీధిలో వెళ్తూంటే మూఢులు ‘మీటింగుల వాళ్లు వీళ్లేనర్రో’ అని తమలో తాము చెప్పుకునేవారట! కొన్నాళ్ళు న్యాయవాదుల దగ్గర పనిచేసిన తర్వాత ఆయనకు ఆ వృత్తిపై వైముఖ్యమేర్పడినది. స్వతంత్రంగా జీవించాలని, లేదా ఉపాధ్యాయుడుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే పత్రికా రచన కూడా మొదలుపెట్టారు. ఆ రోజులల్లో మద్రాసునుంచి కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు ప్రచురించే ఆంధ్ర భాషా సంజీవని పత్రికలో స్ర్తి విద్యకు వ్యతిరేకంగారాసేవారు. దాన్నిఖండిస్తూ ఆయన బందరునుంచి వెవడే పురుషార్థప్రదాయనిలో వ్యాసాలు రాయసాగారు.

- ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి