వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తర్వాత 1874లో తానే వివేకవర్థని పేరుతో మాసపత్రికను ప్రారంభించారు. దానికి అనుబంధంగా హాస్య సంజీవని అనే మాసపత్రికను ప్రారంభించారు. తనపైన, తన రచనలపైనా ఛాందసులు చేసే విమర్శలను ఎదుర్కోవడానికి, సాంఘిక దురాచారాలను ఖండించడానికి ఆయన దాన్ని సాధనంగా చేకున్నారు. పెద్దయ్యగారి పెళ్లి అని పామరులు చెప్పుకున్న బ్రహ్మ వివాహం ప్రహసనము ఈ పత్రికలోనే మొదట వెలువడింది. ఆనాటి న్యాయవాదులు, న్యాయమూర్తుల అవినీతి పనులను, వేశ్యావృత్తిని పోషించే దురాచారాన్ని శక్తివంతంగా ఖండించడానికి ఆయన తన పత్రికలను ఆయుధాలుగా వినియోగించారు. ఈ క్రమంలో ఎందరినో ఎదుర్కొన్నారు. ఎన్నో భాగోతాలు బయటపెట్టారు. వేలంపాట పెట్టి ఎక్కువ సొమ్మునిచ్చిన వారికి అనుకూలంగా తీర్పులు చెప్పే మునసబుగారిని, ఆయనకు చిత్ర తీర్పులు రాసేచిత్రపు కవిరాజు అనే లాయరును పత్రిక కెక్కించారు. ఈనాడు ఎంతగానో చెప్పుకునే పరిశోధనాత్మక జర్నలిజంకు వరవడి పెట్టారు. పరువు పోయిన కవిరాజు ఆత్మహత్య చేసుకోగా, మునుసబుకు మతి చలించింది. ప్రభుత్వోద్యోగులు, ప్లీడర్లు, కపట స్వాములు, వేశ్యాగృహ నిర్వాహకులు ఆయనను, ఆ పత్రికను తిట్టిపోశారు. అయినా ప్రజల ఆదరణతో 1876లో పక్షపత్రికగా మారింది. ఆనాటి ఆ ఇంగ్లీష్ విభాగం కూడా వుండేది. ఇక తెలుగు విభాగంలో భాషా, సాహిత్య సంబంధమైన వ్యాసాలు, రచనలు, సమీక్షలు వగరాలుండేవి. ఈ అనుభవాల స్వీయ చరిత్రలో సజీవంగా సాక్షాత్కరిస్తాయి.
వీరేశలింగంగారి ఉద్యమానికి రెండు చక్రాలు. ఒకటి సాహిత్యం, రెండోది సంఘ సంస్కరణ. సాహిత్యకారుడుగా ఆయన కృషి అసాధారణమైంది. అందులోనూ అంతటి కార్యశీలిగా వుంటూ అన్ని రచనలు చేయడం ఆయనకే చెల్లింది. నన్నయ్య కాలంనుంచి ఆయన కాలంవరకు వెయ్యేళ్లు తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం, ఇతివృత్త వైవిధ్యం నాస్తి. మానవునికే పరిమితమైన కథాంశాలూ లేవు. ఆ పరిస్థితులలో వీరేశలింగం లౌకిక సాహిత్యానికి నాంది పలికారు. అనేక సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడయ్యాడు. 1899లో గోల్డ్‌స్మిత్ నవల ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ ఆధారంగా రాజశేఖర్ చరిత్ర అనే తొలి తెలుగు నవల రాశారు. దేవుళ్లు, రాజులను గాక మానవుడ్ని కథానాయకుడిగా తీసుకున్నారు. మొత్తంపైన ఆయన రచనలు వందకుపైనే వుంటాయి. క్రొత్త గ్రంథాలు రాయడమేగాక, పాతవి పరిష్కరించి ప్రచురించారు. వ్యాకరణం రాశారు. ఆఖరుకు వైజ్ఞానిక దృష్టితో జీవశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటివి తెలుగులోకి తీసుకువచ్చారు. అందుకోసం ఆ రోజుల్లోనే జంతువులు, మానవుల శరీర భాగాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తెలుగులో తొలిసారి సమగ్రంగా కవుల చరిత్ర రాశారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- ఇంకా ఉంది

తెలకపల్లి రవి