వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1899లో గోల్డ్‌స్మిత్ నవల ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ ఆధారంగా రాజశేఖర్ చరిత్ర అనే తొలి తెలుగు నవల రాశారు. దేవుళ్లు, రాజులను గాక మానవుడ్ని కథానాయకుడిగా తీసుకున్నారు. మొత్తంపైన ఆయన రచనలు వందకుపైనే వుంటాయి. క్రొత్త గ్రంథాలు రాయడమేగాక, పాతవి పరిష్కరించి ప్రచురించారు. వ్యాకరణం రాశారు. ఆఖరుకు వైజ్ఞానిక దృష్టితో జీవశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటివి తెలుగులోకి తీసుకువచ్చారు. అందుకోసం ఆ రోజుల్లోనే జంతువులు, మానవుల శరీర భాగాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తెలుగులో తొలిసారి సమగ్రంగా కవుల చరిత్ర రాశారు. 1883లో స్ర్తిల కోసం ప్రత్యేకంగా సతీహిత బోధిని అనే పత్రిక నడిపారు. స్ర్తిలు చైతన్యపరిచే ఎన్నో రచనలు దానిలో వెలువరించారు.
స్ర్తివిద్య, వితంతు పునర్వివాహం కోసం వీరేశలింగం, ఆయన మిత్ర బృందం, శిష్యబృందం సాగించిన మహోద్యమం గురించి స్వీయచరిత్రలో చదువుతుంటే ఉత్సాహం, ఉత్తేజం ముప్పిరిగొంటాయి. సమాజంలో మార్పుకోసం పోరాడటంలోని సాధక బాధకాలు అవగతమవుతాయి. ఎందరినో కదిలించి, వెంట నడిపించుకోగలిగారు గనుకనే ఆయన ఒక సామాజిక శక్తిగా మారగలిగారు. ఆ రోజుల్లోనే వితంతు పునర్వివాహం కోసం ముప్ఫయివేల రూపాయలు విరాళమిచ్చిన పైడా రామకృష్ణయ్య వంటివారి ప్రోత్సాహ, ప్రోద్భలాలు మరచిపోరానివి. ఆయన 1879లో మిత్రులతో కలిసి సంఘ సంస్కార సమాజం స్థాపించారు. వివిధ విషయాల గురించి ఉపన్యాసాలు మొదలుపెట్టారు. మిత్రుల ప్రోత్సాహంతో 1879 ఆగస్టు 3న రాజమండ్రిలో వితంతు పునర్వివాహాలు ధర్మశాస్తబ్రద్ధమేనంటూ తొలి ప్రసంగం చేశారు. అయితే, ఆంధ్రదేశంలో సంచలనం రేగింది. ఖండన మండనలు వెల్లువెత్తాయి. వీటికి సమాధానంగా అదే ఏడాది అక్టోబర్ 12న రెండవ ప్రసంగం చేశారు. పండిత సభల్లో సవాలు చేసిన ఛాందసులు, తిరోగాములు వీరేశలింగం వాదనలను ఎదుర్కోలేక తబ్బిబ్బయ్యారు. ఆయనపై దౌర్జన్యం చేసి కసి తీర్చుకుందామని రాజమండ్రిలో ఒకసారి, కాకినాడలో ఒకసారి తీవ్ర ప్రయత్నం చేశారు. కాని విద్యార్థులు ఆయనను కాపాడారు. - ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..