వినమరుగైన

కందుకూరి స్వీయ చరిత్రము (కందుకూరి వీరేశలింగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరేశలింగం నవభావాలు యువతరానికి ఎంతో నచ్చాయి. అందుకే వారాయన వెన్నంటి నిలిచారు. సంస్కరణలకు ముందుకు వచ్చారు. పీఠాధిపతుల లోపాలు, లొసుగులు బయటకు లాగారు. సమాచార సేకరణలో, సంరక్షణలో ఎంతో తోడ్పడ్డారు. అలాగే ఎందరో శ్రేయోభిలాషులు, దాతలు సంస్కరణాభిలాషులు ఆ మహనీయునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడ్డారు. ఆ విధంగా తనతోపాటు నిలిచిన మిత్రులను అన్నివేళలా అండగా వున్న విద్యార్థి బృందాన్ని గురించి ఆయన ఎంతో అభిమానంగా రాశారు.
నాటి రోజుల్లో సహపంక్తి భోజనాలకు, వితంతు వివాహ విందులకు హాజరుకావడమే పెద్ద సాహసం. ఒకో పునర్వివాహం ఒక యజ్ఞమే. వితంతువులకు ఆశ్రయమివ్వడం, పెళ్లి నిర్విఘ్నంగా చేయడం, ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఎదురవడం ఎన్నో సమస్యలు. ఇవన్నిటా ఎందరో శ్రేయోభిలాషులు ఆయనకు తోడ్పడ్డారు.
1881 డిసెంబర్ 11న ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహం రాజమండ్రిలో జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన గౌరమ్మను వీరేశలింగం సన్నిహితులైన గోగులపాటి శ్రీరాములు రాజమండ్రిలో పెళ్లిచేసుకున్నారు. నిజానికది వివాహం కాదు. పెద్ద సాంఘిక సంగ్రామం. ఒక కురుక్షేత్రం. ఆనాటినుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా వీరేశలింగం వెనుకంజ వేయలేదు. ఎక్కడెక్కడ వితంతువులకు ఆ పుణ్య దంపతులే ఆశ్రయమిచ్చారు. విద్యా, వైద్యం కల్పించి పెళ్లిళ్లు చేయడమేగాక కొత్త జంటలకు కొంత భృతి కూడా కల్పించారు. తన మీద గౌరవం గల దాతల ద్వారానూ, తాను స్వయంగానూ వీరేశలింగంగారు పెద్ద పెద్ద మొత్తాలు ఇందుకు వెచ్చించారు. ఆశ్రమాలు, విద్యాసంస్థలు కట్టించారు. కాలక్రమంలో కొందరు మిత్రులు శత్రువులుగా మారినా, సహాయం పొందినవారే కృతఘు్నలుగా మారినా, అనారోగ్యం వెంటాడినా ఆయన నిస్పృహ చెందలేదు. అసహాయశూరునిగా అవిశ్రాంతయోధునిగా ముందుకు సాగా రు. అందరి మన్ననలు పొందారు. తెలుగుదేశంలోనే కాదు, దక్షిణ భారతమంతటా ఖ్యాతిగాంచారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయనకు అభినందన సందేశం పంపించారు. సుబ్రహ్మణ్య భారతి ఆయనని పాత్రగా పెట్టి నవల రాశారు.
సాహిత్యం, సంస్కరణలతోపాటు ఇతర విషయాల్లోనూ ఆయన దూరదృష్టి కనపరిచారు. గ్రంథాలయాలు నెలకొల్పారు. పురపాలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పురమందిరం పేర టౌన్‌హాల్ కట్టించారు. ఇవన్నీ ఆయన ఆధునిక దృష్టికి అద్దంపడతాయి. ఇందుకు సంబంధించిన జమాఖర్చులు కచ్చితంగా రాసిపెట్టడం గొప్ప విశేషం.
స్వీయచరిత్రలో ఈ పరిణామాలన్నీ సవివరంగా చూడగలుగుతాము. అడుగడుగునా ఆయన కార్యశీలత, వినమ్రత గమనిస్తాము. జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ఆయన ప్రతిస్పందన కూడా కనిపిస్తుంది.
- ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

తెలకపల్లి రవి