వినమరుగైన

నా జీవితయాత్ర(టంగుటూరి ప్రకాశం పంతులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తుల చరిత్ర రెండు విధాలుగా రాయబడుతుంది. ఒకరి చరిత్రను ఇంకొకరు రాస్తే దాన్ని జీవిత చరిత్ర అంటారు. ఇంగ్లీషులో బయోగ్రఫీ అంటాం. ఎవరి చరిత్రను వారే రాసుకుంటే అది స్వీయచరిత్ర. దీన్ని ఆటోబయోగ్రఫి అంటారు.
జీవిత చరిత్ర రాయడం, స్వీయ చరిత్ర రాయడంకన్నా ఒక విధంగా కష్టం. చరిత్రకారుడు ఎవరి జీవితాన్ని అక్షరీకరింపదలచుకున్నాడో అతని అంతరంగంలోకి తొంగి చూడగలగాలి. అది సంపూర్ణంగా సాధ్యమయ్యే పనికాదు.
ప్రతి జీవితంలో రెండు జీవితాలుంటాయి. ఒకటి అంతర్గత జీవితం, రెండోది బహిర్గత జీవితం. అంతర్గత జీవితం ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమై ఉంటుంది. బహిర్గత జీవితం పదిమందికి తెలిసి వుంటుంది.
పదిమందికీ తెలిసిన బహిర్గత జీవిత ప్రభావం- తానొక్కరికే తెలిసిన అంతరంగ జీవితంమీద ఎలా వుంటుందో- అలాగనే పదుగురుకూ తెలియని అంతరంగ జీవిత ప్రభావం- బహిరంగ జీవితంమీద కూడా వుంటుంది.
The influences of private life inspires the public life where as the public life also spreads its shadows on private life.
జీవిత చరిత్రకారుడికి లేని సౌలభ్యం- స్వీయ చరిత్రకారుడికి ఉందనడానికి కారణం- అతని వైయక్తిక బహిర్గత జీవితాలు- రెండూ స్వయంగా అనుభవించినయ్ గనుక-
అనుభూతి వేరు- అనుభూతిని అవగాహన చేసుకొని అక్షరీకరించడం వేరు. అయితే స్వీయ చరిత్రకారుడు నిజాయితీపరుడైనప్పుడే కథనంలో సుగంధం ఉంటుంది.
ఆత్మకథ రాసుకోవడం అందరూ చేయకూడని పని- చెయ్యలేని పని. ఎవరి జీవిత విధానం తరువాతితరంవాళ్లను ప్రభావితం చేస్తుందో అలాంటి వాళ్లే రాసుకోవాలి.
"Lives of great men all remind us that we can make our lives sub-lime and departing leave behind us footprints on the sands of Time. A ship wrecked and forlorn traveller should see them and take heart again'' అన్న అర్థంలో అమెరికా అగ్రేసర కవి హెఛ్.డబ్ల్యు. లాంగ్‌ఫెలో అంటారు. జీవిత మైదానాల్లో ఎవరి పాదముద్రల గుర్తులు ప్రస్ఫుటంగా అవుపించి, తర్వాతి తరాల వాళ్లని ప్రభావితం చేస్తాయో- అతనిదీ జీవితమంటే. అలాంటివాళ్ల చరిత్రలే రాయబడాలి.
స్వీయచరిత్రలు రాసుకోవడం కొత్తేం కాదు. మై ఎక్స్‌పీరియన్స్ విత్ ట్రూత్ అనే పేరుతో గాంధి వ్రాసుకున్నారు. యాన్ ఆటోబయోగ్రఫి జవహర్‌లాల్ నెహ్రూ స్వీయచరిత్రే.
తెలుగులో వీరేశలింగం అనే సాహిత్య ప్రక్రియలకి ఆద్యుడైనట్టే స్వీయచరిత్ర రచనకు కూడా ఆద్యులు.
ఇపుడు మనం ముచ్చటించుకోబోయే గ్రంథం నా జీవితయాత్ర. అది టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వీయచరిత్ర. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రులకు ఆరాధ్య నాయకుడు. స్వతంత్ర పోరాటంలోనూ, స్వాతంత్య్రానంతర స్వరాష్ట్ర ప్రగతి నిర్వహణలోనూ ఆయన పాత్ర గొప్పది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

-డాక్టర్