వినమరుగైన

నా జీవితయాత్ర(టంగుటూరి ప్రకాశం పంతులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రండిరా ఎద కాల్చుకొండిరా’ అంటూ బ్రిటీష్ తుపాకీలకు రొమ్ములెదురొడ్డి ముందు సాగిన సాహసమూర్తి. ఆంధ్రకేసరి అన్న సార్థక నామధేయుడు.
నా జీవిత యాత్ర పేరిట పంతులుగారు తమ ఆత్మకథను మూడు భాగాలుగా 1940-41 వరకు రాసుకున్నారు. అనంతరం చరిత్రని ఆయనకి అత్యంత సన్నిహిత సహచరుడు తెనే్నటి విశ్వనాథంగారు అనుబంధ సంపుటిగా ప్రచురించారు.
ఎమెస్కో పాకెట్ బుక్స్ వారు తిరిగి ప్రచురించిన ఎడిషన్‌లో 1972లో భారత రాష్టప్రతి వరాహగిరి వెంకటగిరి ప్రస్తావనలో ప్రకాశంగారిని ఇలా ఆవిష్కరించారు.
‘‘పంతులుగారొక వ్యక్తి కాదు, అర్థశతాబ్దానికిపైగా ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ఆయన ఒక మహాసంస్థ. ఆయన వ్యక్తిత్వం మహాగోపుర శిఖరోన్నతం. ఆయన జీవిగాథ బహుముఖ ప్రకాశం గలది. బొడ్డున మాణిక్యం పెట్టుకొని పుట్టిన భాగ్యశాలి కారాయన. అతి సామాన్య స్థితి- కాదు నిరుపేద దశలో నుండి ఎదిగి ఎదిగి మహాద్వైభవశృంగాన్ని అందుకొన్న అతి సత్త్వుడాయన. ఉజ్జ్వల దేశభక్తి, నిరుపమాన త్యాగశీల, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన అక్షయశక్తి, స్వభావ సౌష్టవం- ఆయన విజయ హేతువులు’’ అంటారు. ఆయన చెప్పిన లక్షణాలన్నీ రుూ పుస్తకం పేజీల్లో పరచుకొని పఠితలకు ప్రత్యక్షమవుతాయి.
‘‘తెలుగు మాట్లాడు ప్రజల ముఖ్య లక్షణాలు ప్రకాశం పంతులుగారిలో పుంజీవభించినవి. రాజఠీవిగల పురుషసింహుడు ఆయన. పాతపద్ధతులను అంటిపెట్టుకొనని విప్లవాది. ప్రాచీన దురాచార విరోధి. స్వాభావికముగా ఆయనది విప్లవ ప్రకృతి’’ అని మన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ప్రకాశం పంతులు ప్రతిభను భద్రమైన త్రాసుతో తూచారు.
ఇవన్నీ అలా వదలి ప్రకాశంగారు తన జీవిత చరిత్రలో ఏమి రాశారని ఆలోచిస్తే- వక్రతలేని తన వ్యక్తిత్వాన్ని అచ్చుపోశారు. తన ధైర్యగుణాన్ని దర్శింపజేశారు. దాతృత్వానికి దారులు చూపారు. నిజాయితీకి, నిర్భీతికి నిలువుటద్దమైన తన జీవితాన్ని నిర్మమకారంతో ఆవిష్కరించుకున్నారు.
తను ఈదిన దారిద్య్రపు లోతుల్ని పఠితలకు చూపించారు. తను ఎక్కిన మహోన్నతాదర్శాల అవకాశాల ఎవరెస్టు ఎత్తులకి ఉదాత్తంగా పాఠకుల్ని అధిరోహింపజేశారు. దేశ స్వాతంత్ర సమరంలో సామాన్యుల అసామాన్యుల వీరోచిత పోరాట విధానాలను విపులీకరించారు. తను నివసించిన కాలపు ప్రజా జీవిత విధానాన్ని విశే్లషించారు. భారత స్వతంత్ర పోరాటంలో సంభవించిన వివిధఘట్టాలను వింగడించారు. నాయకుల అంతరంగాల్ని తన కోణం నుంచి అనే్వషించారు.

ఇంకాఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

నాగభైరవ కోటేశ్వర రావు