వినమరుగైన

నా జీవితయాత్ర(టంగుటూరి ప్రకాశం పంతులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు బలవంతంగా వెళ్లదలిస్తే- మేం కాల్చవలసి వస్తుందన్నాడు వాడు. నా పక్కన గుంపులో వున్న ఒక మహమ్మదీయ యువకుడు కాల్చు, మేమందరం సిద్ధంగానే వున్నాం అని అరిచాడు. కొన్ని క్షణాలకు వాడు తప్పుకుని దారి యిచ్చాడు.
ఇలా ఆసక్తిదాయకంగా సాగిపోయే కథనశైలితో పుస్తకం నిండా సంఘటనలు గుదిగుచ్చాడు ప్రకాశంగారు. అందుకని పాఠకులను ఉత్సుకతతో ఊపివేస్తుందీ పుస్తకం.
నవలలాగా స్వీయచరిత్ర ఉత్సుకతతో చదివించుకుపోవడమంటే సామాన్య విషయం కాదు. అయితే ప్రకాశంగారి జీవితమే సాహసవంతమైన సంఘటనల కూర్పు. దేశభక్తితో, ధైర్యంతో, సాహసంతో అడుగులు వేసిన ప్రయాణం. అందుకని నా జీవితయాత్ర స్వీయచరిత్రలకే శీర్షమానమై నిలుస్తుంది.
ప్రకాశంగారు యిలా అన్నారు ముగింపు పేరాల్లో...
‘‘నేను దేశంలో రాజకీయంగా ఎదిగిన పోరాటాలలో ఎలా పాల్గొని ఏయే మార్గాల దేశ సేవ చేశానో, దానికి మనోవాక్కాయాల ప్రయత్నించానో, పుట్టింది బీదల ఇళ్లలోనూ పెరిగింది అక్కడే అయినా ప్రజల నుంచి లాయరుగా సంపాదించిన లక్షలాది ధనం తిరిగి ప్రజల సుఖ సంతోషాలే వాంఛిస్తూ దేశ మాత దాస్యశృంఖలాలను ఛేదించి ఆమెను సంపూర్ణ స్వతంత్ర వాయువుల్లో ఉయ్యాలలూగించాలనే తలంపుతో రాజకీయ సమరంలో నిస్వార్థంగా ఖర్చుపెట్టి, మళ్లీ ఎలా ఏమీలేని వాడినయ్యానో చదువరులు గ్రహించే వుంటారు’’ అంటారు.
ప్రకాశం ఏమీలేనివాడు కాడు. కాబోడు. చరిత్రలో చెరిగిపోని కీర్తి వున్నవాడు. ఆంధ్రకేసరిగా ఆంధ్రుల హృదయాల్లో చెదిరిపోని స్థానం వున్నవాడు. తన పేరిట ఒక జిల్లా వున్నా లేకున్నా ఆదర్శ ఆంధ్ర నాయకత్వానికి ఖిల్లాగా రెపరెపలాడేవారు.
నా జీవితయాత్ర ఈ శతాబ్దంలో వచ్చిన అరుదైన తెలుగు పుస్తకం. చదువు వచ్చిన ప్రతి తెలుగువాడూ చదవాల్సిన పుస్తకం.

అయిపోయింది

నాగభైరవ కోటేశ్వర రావు