వినమరుగైన

నేనూ- నా దేశం (దరిశి చెంచయ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తొలినాటి వామపక్ష రాజకీయాల గూర్చిన ఎంతో విలువైన అంశాల గూర్చి ఈ గ్రంథం తెలియజేస్తుంది. కమ్యూనిస్టు పార్టీలో తాను చేరడానికి స్ర్తి విముక్తి అనే ఆశయం ఎలా దోహదం చేసిందీ, ఆయన మాటల్లోనే తెలుసుకొందాం. నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్ర్తిల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి చేసి పూర్తిగా సాధించలేకపోవడంవల్ల కలిగిన అసంతృప్తి; స్ర్తిల కష్టాలు ఒక్క సోషలిస్టు రష్యాలో మాత్రమే నశించాయన్న సత్యమే నన్ను కమ్యూనిజం వైపు తిప్పింది (పు.489). సామ్యవాద దశలో చెంచయ్య మద్రాసులో కార్మిక సంఘాల్లో బీడీ, చుట్టల కార్మిక సంఘాలతోపాటు, స్పెన్సర్ కంపెనీ, మద్రాసు కార్పొరేషన్ పనివారల అభ్యున్నతికి పాటుపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోని ఆనుపానుల గూర్చి, వాటి పనితీరును గూర్చి నిజాయితీతో విశే్లషించాడు.
జీవిత ప్రారంభం నుండీ తానెదుర్కొంటున్న ఈతిబాధలు, వాటికితోడు ఆర్థిక బాధలు చెంచయ్యగార్ని వెంటాడుతూనే వున్నాయి. జీవితపు ఆటుపోట్లలో ఆయన దన్నుగా నిలిచిన భార్య దరిశి సుభద్రమ్మ మహిళా సంఘాల్లో కృషి చేస్తూ, స్ర్తిల అభ్యున్నతికి పాటుపడింది. సుభద్రమ్మ కృషి గూర్చి ఇంతవరకూ ఎవరూ ఎక్కడా పేర్కొనకపోవడం దురదృష్టం. అనిబిసెంట్ సహచారిణిగా వుంటూ, అఖిల భారత మహిళా సమాఖ్య కార్యక్రమాల్లో దక్షిణ భారతదేశంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె నేతృత్వంలో పతిత యువతీ జనోద్ధరణ, స్ర్తిలల్లో విద్యా వ్యాప్తి కొనసాగింది. దరిశి చెంచెయ్యగారి జీవిత చరిత్ర ఒక గని లాంటిది. ఆయన జీవిత లక్ష్యం, దేశ స్వాతంత్య్రమే కాదు స్వాతంత్య్రానంతరం సమాజం ఏ దిశలో నడవాలీ, దేశ పునర్నిర్మాణం బడుగుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో ఆయన ఆశించాడు. ఆర్థిక అసమానతలు, సామాజిక ఎత్తుపల్లాలను తొలగించిన స్ర్తిజనోద్ధరణ దేశానికి ఆయువుపట్టుగా భావించి కృషిచేసిన మహనీయుడు. ఈ క్రమంలో రూపుదిద్దుకొంది చెంచయ్యగారి వ్యక్తిత్వం. ఆయన ప్రాపంచిక దృక్పథానికి, తను పాల్గొన్న ఉద్యమాలు ఎలా దోహదం చేశాయో వ్యక్తీకరిస్తుంది ఈ గ్రంథం. చిత్తశుద్ధికి నిష్కపటత్వం తోడై స్వీయ పొరబాట్లను నిష్కర్షంగా అంగీకరించే మనస్తత్వం ఆయనది. చిన్నప్పటినుండీ ఒక నిరసనవాదిగా మార్పుకోసం కృషిచేయాలన్న తపన ఆయన రాసిన ప్రతి అక్షరంలో కన్పిస్తుంది. నేటి యువతరం తప్పక చదవాల్సిన గ్రంథం దరిశి చెంచయ్య నేను-నా దేశం.రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
అయపోయంది

వకుళాభరణం రామకృష్ణ