వినమరుగైన

ఇదీ నా గొడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకథలు సామాజిక జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. చరిత్ర రచనకు ఉపయోగిస్తాయి. పాఠకులను ఉత్తేజపరుస్తాయి. ఆత్మకథ రచించినవారికీ, చదివేవారికీ కల్మష క్షీణనకు ఉపయోగపడతాయి. ఆత్మకథల్లో అబద్ధాలు, అతిశయోక్తులు, స్వోత్కర్షలు వుండగూడదు. ఉన్నది ఉన్నట్లు సుగుణాలు, దుర్గుణాలు బట్టబయలు కావాలి తనవి కాని ఇతరులవి కాని. కనుకనే ఆ వివరాలన్నీ కొందరిని బాధపెడతాయేమోననీ, రచయితగా తనపై వివిధ రకాల దాడులు జరగవచ్చుననీ ఆలోచించి, కొందరు తమ ఆత్మకథలను తాము సజీవంగా వున్నప్పుడు ప్రచురింపవద్దనీ, మరణించిన తర్వాత ప్రచురించమనీ కోరుతుంటారు. అటువంటి భయాలు, సంకోచాలు కాళోజీ (కాళోజీ నారాయణరావు)కి లేవు. ఆయన ముక్కుసూటి మనిషి. ఎదుటివాడు ప్రాణ స్నేహితుడైనా సరే, దేవుడైనా సరే లెక్కపెట్టడు. తాను అనదలచుకున్నది అనేస్తాడు. తను చెప్పదలచుకున్నది చెప్పేస్తాడు. అడగాలనుకున్నది అడిగేస్తాడు.
కొందరు తమ ఆత్మకథలను ఒక క్రమంలో రాస్తారు. మరికొందరు తమ జ్ఞాపకాలను గుదిగుచ్చి శకలాలు శకలాలుగా అందిస్తారు. గతంలో తిరుపతి వెంకట కవులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, ఆచంట జానకీరాం, డాక్టర్ సంజీవ్‌దేవ్, తిరుమల రామచంద్ర, శ్రీశ్రీ, జి.కృష్ణ మొదలగువారు తమ జ్ఞాపకాలను తెలుగు పాఠకులకు అందించారు. అటువంటి జ్ఞాపకాల సంపుటే కాళోజీ రాసిన ఇదీ నా గొడవ. వీటిని ఇంగ్లీషులో మెమొరీస్ అంటాం. ఈ పదాన్ని మెమ్మోర్స్ అని ఉచ్చరించాలి. చాలామంది ఈ పదాన్ని మెమోయిర్స్ అంటారు.
ఇక కాళోజీ గొడవకు వస్తే నిజానికి ఇది ఆయన రాసినది కాదు. ఆయన చెప్పిన విషయాలు రికార్డు చేసిన కేసెట్ల ఆధారంగా రూపొందించబడిన ఆత్మకథ ఇది. తూర్పు మల్లారెడ్డి, ఎ.బి.కె.ప్రసాద్, వాసుదేవరావు, స్మైల్ మొదలగువారు వేర్వేరు సందర్భాలలో 1985 లో కాళోజీ జ్ఞాపకాలను రికార్డు చేశారు. స్వేచ్ఛా సాహితి ప్రచురణగా ఈ పుస్తకం ఇదీ నా గొడవగా సెప్టెంబర్ 1995లో ప్రచురితమైంది.
ఇది నా జీవిత కథ. ఇందులో ఒక క్రమపద్ధతి లేదు. తారీఖులు, దస్తావేజులు లేవు. మా కుటుంబం, స్నేహాలు, సంఘం, సాహిత్యం, రాజకీయాలు- వీటి వూసులే వుంటాయి అంటూ ఈ ఆత్మకథ ప్రారంభవౌతుంది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొత్తపల్లి రవిబాబు