వినమరుగైన

ఇదీ నా గొడవ ( కాళోజీ నారాయణరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

9-9-1914న జన్మించిన కాళోజీకి ఈ ఆత్మకథ ప్రచురించేనాటికి 81 ఏళ్లు కాగా, ప్రస్తుతం ఆయన 87సంవత్సరాల వృద్ధ యువకుడు. ఆయన అన్నయ్య రామేశ్వరరావు ఏడవ ఏటనే, కాళోజీ తన ఏడవ నెలలో ఆయన భుజాలమీద ఎక్కాడు. రామేశ్వరరావు ఇటీవల మరణించేవరకు ఆయన తన అన్న అండలోనే కొనసాగాడు. రామేశ్వరరావు కవి. ఆయన ఉర్దూలోనూ, హిందీలోనూ కవిత్వం రాసేవాడు. తన 14వ ఏట నుంచీ కుటుంబ సంరక్షణ భారం వహించాడు. అడ్వకేటు వృత్తిలో వుండేవాడు. కాళోజీకి సొంత ఇల్లు కానీ, విడిగా అద్దె ఇల్లు కానీ లేవు. అన్న రామేశ్వరరావు ఇంట్లోనే ఆయనా వుండేవారు. కాళోజీని పోషించే బాధ్యతలు తీసుకున్నది ముఖ్యంగా ఆయన అన్నగారే. రామోశ్వరారవుది ఎంత రెగ్యులర్ జీవితమో, కాళోజీది అంత ఇర్రెగ్యులర్. కాళోజీ స్నేహితులు, కవులు, కళాకారులు కూడా రామేశ్వరరావుకు అతిథులే. కాళోజీ కార్యక్రమాలపై, భావాలపై ఆయన ఏనాడూ ఆంక్షలు విధించలేదు. ఉద్యమాల్లో పాల్గొనవద్దని శాసించలేదు. కాళోజీ తన నా గొడవ అనే కవితా సంపుటిని అన్నయ్యకు అంకితం ఇస్తూ ఇలా అన్నాడు.
ఎనే్నళ్లు వచ్చినను చిన్నవాడి నటంచు
అతి గారాబము తోడ అన్ని సమకూర్చుచును
ఆటలకు పాటలకు అవకాశమిచ్చిన
అన్నయ్యకు నా గొడవ అంకితము చేతు
ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని బీజపూర్ జిల్లాలో వున్న రట్టిహళ్లి అనే గ్రామంలో కాళోజీ జన్మించారు. అమ్మకు కన్నడం, మరాఠీ భాషలే వచ్చేవి. నాయనకు మరాఠీ రాదు. హిందీ తెలుసు. అమ్మ మరాఠీలో, నాయన ఉర్దూలో- ఇద్దరూ అర్థం చేసుకునేవారు. పిల్లలు నాయనతో ఉర్దూ, అమ్మతో మరాఠీ, తోటివారితో తెలుగులో మాట్లాడేవారు. అలా వీరి మాతృభాషలు మూడు. కాళోజీకి రెండవ ఏట వరంగల్ సమీపాన వున్న మడికొండ గ్రామానికి వచ్చారు. కాళోజీ తండ్రి అక్కడ పిల్లలకు చదువు చెప్పేవారు. హైదరాబాదు, వరంగల్ పట్టణాలలో చదివిన కాళోజీ 1939లో లా పరీక్ష పూర్తిచేసి, 1940లో లాయర్‌గా చేరారు. అయితే ఆయన ఆ వృత్తిలో ఏనాడూ లేరు. ఆర్య సమాజం, హిందూ మహాసభ, గ్రంథాలయోద్యమం మొదలగు కార్యక్రమాలు ఆయన్ను ఆకర్షించాయి. తెలంగాణలో ఆనాటి గ్రామీణ వ్యవస్థ గురించీ నిజాం పరిపాలనా వివరాలు కాళోజీ చాలా వివరణాత్మకంగా చెప్పారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొత్తపల్లి రవిబాబు