వినమరుగైన

ఇదీ నా గొడవ ( కాళోజీ నారాయణరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగిలినవారి మాండలీకాలు తెలుగు కావు అనే వాదనను కాళోజీ నిశితంగా ఖండించారు. అయితే అన్ని మాండలీకాలలోని పదాలను తనలో కలుపుకుంటూ ఒక సాధారణ వ్యవహారిక భాష రూపొందితే అది సాహిత్య భాషగా అందరికీ అర్థమయ్యేటట్లు తయారౌతుంది. నా గొడవలో కాళోజీ ఇలా అన్నారు.
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలింపు ఆంధ్రుడా- చావవెందుకురా?
అంతేగాక-
రెండు జిల్లాలదీ
దండి భాష అయినప్పుడు
తక్కినోళ్ల నోళ్ల యాస
తొక్కి నొక్కబడ్డప్పుడు
ప్రత్యేక రాజ్యం పాలు
అడక్కతప్పదు మరి- అంటున్నారు.
వట్టికోట ఆళ్వారుస్వామి కాళోజీకి స్నేహితుడు. కాళోజీ మాటల్లో చెప్పాలంటే, ఉద్యమాల్లో పాల్గొంటున్నవారిలో భార్యను కూడా సభలకు తీసుకుపోయే వ్యక్తి ఆళ్వారుస్వామి ఒక్కరే. ఆయన 1944, మార్చి 13, 14 తేదీలలో బెజవాడకు అఖిల భారత రైతు మహాసభకి భార్యతో కలిసి వెళ్లారు. ఆళ్వారుస్వామి నడిపిన దేశోద్ధారక గ్రంథమాలలో 800 మంది సభ్యులుగా చేరారు. ఈ ఆళ్వారుస్వామి కాళోజీ కవితా సంపుటి నా గొడవ మొదటిసారిగా అచ్చువేసి సభ్యులకు పంపించారు.
ఆత్మకథలు ఆత్మ విమర్శనాత్మకంగా వుంటాయి. చేసిన తప్పుల గురించి ఆత్మవిమర్శ ఉండాలి. అటువంటి వాటిని కాళోజీ తన ఆత్మకథలో కాళోజీ గర్వభంగం సంఘటనలుగా పేర్కొన్నారు. ఒకసారి కాళోజీ అరెస్టయిన సందర్భంగా ఆయన్ను హన్మకొండలో లాకప్‌లో పెట్టారు. ఆ గదిలో మరో వ్యక్తి వున్నాడు. సత్యాగ్రహిని, కాంగ్రెసోడిని ఈ నేరస్తునితో సమానం చేస్తారా అని బాధపడ్డారు కాళోజి. ఆ రెండవ అతను ఈయన్ను ఏ నేరంపై జైలుకి వచ్చాడో తెలుసుకుందామని ప్రశ్నమీద ప్రశ్న వేసి చివరకు గాంధీమహారాజ్‌కిన్నీ, హుజూర్ నైజాంకి లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు గద నువ్వు? అన్నాడు. మారుమూల గ్రామాల్లో అట్టడుగు జీవితాల్లో కూడా గాంధీ పేరు చొచ్చుకుపోయింది. మేం మాత్రం అజ్ఞానంతో, అహంకారంతో గ్రామీణులను దూరం చేసుకున్నాం అన్నారు కాళోజీ. ఇది ఒక గర్వభంగ సంఘటన.
కాళోజీని జైల్లో డబుల్ సెల్‌లో వేశారు. ఆ గదిలోపలే మలవిసర్జనకు డబ్బా, నీళ్లకుండ, కంచం, లోటా, గోనెపట్టాలు, గోంగళి వుండేవి. టెర్రరిస్టులు కొందరు ఆ జైల్లోనే వున్నారు. కానీ గాంధీవాదులకు టెర్రరిస్టులకంటే శత్రుభావం. కాళోజీ జైల్లో పడిన రోజు టెర్రరిస్టు సర్దార్ మంగళ్‌సింగ్ ‘గాంధీవాది కాళోజి నారాయణరావు జైలుకు వచ్చాడని తెలుసుకున్నాడు. హింసావాది మంగళ్‌సింగ్ గమ్మునుండకుండ తెల్లవారేవరకు వేడి వేడి జొన్నరొట్టె, కారప్పొడితోపాటు ధైర్యం చెబుతూ చీటీ పంపించాడు’. ఆ విధంగా నైతిక మద్దతు ప్రకటించారు. అదే సమయంలో హయగ్రీవాచారితో సహా కాంగ్రెస్ వారెవరూ కాళోజీ గురించి పట్టించుకోలేదు. ఇది కాళోజీ రెండో గర్వభంగం.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకాఉంది

కొత్తపల్లి రవిబాబు