వినమరుగైన

ఇదీ నా గొడవ ( కాళోజీ నారాయణరావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ వకీలు ఒద్దిరాజు రాజేశ్వరరావుది 49 మంది సభ్యులున్న కుటుంబం. ఎవరికీ దోమతెర లేదు. ఒకరోజు కాళోజి ఆయనతో మాట్లాడుతూ ‘దోమతెర కొనుక్కోరాదా’ అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు గదా 49 మందికీ కొనగల్గే శక్తి వచ్చిన్నాడే కొనుక్కుంటానన్నాడు. ఆయనకు 49 మందిపైన సమగ్రమైన, సమానమైన దృష్టి వుంది. కాళోజీ అలా ఆలోచించలేదు. ఈ సందర్భంగా కాళోజి అంటారు కదా- నా ఆలోచనా ధోరణికి, జీవితంలో ఆచరణకి ఎంత తేడా? ఎంత బూటకం. తనది ప్రజా దృక్పథం అనుకునే కాళోజీకి ఎంత గర్వభంగం. ఇది కాళోజి మూడో గర్వభంగం.
అహింసావాది సత్యాగ్రహి, కాంగ్రెస్ పార్టీ వాడైనా కాళోజి బైరాన్‌పల్లి సంఘటనతో ప్రతిహింసను సమర్థించే కవిత రాశారు. జనగాం దగ్గర బైరాన్‌పల్లి గ్రామ ప్రజలు రజాకార్లతో పోలీసులతో పోరాడి, చాలాసార్లు తరిమికొట్టారు. కోట బురుజును స్థావరంగా చేసుకుని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతిఘటించారు. అయితే 1948 ఆగస్టు చివరివారంలో రజాకార్లు, పోలీసులు గ్రామాన్ని స్వాధీనం చేసుకుని గ్రామప్రజల్ని మూడు నాలుగు వందల మందిని కాల్చేశారు. ఇది తెలిసి వరంగల్ జైల్లో వున్న కాళోజి ఈ సంఘటనపై స్పందించి రాసిన గేయం ఇది-
మన కొంపలార్పిన మన స్ర్తిల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచిపోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుస కొట్టుతుండాలె
కాలంబు రాగనె కాటేసి తీరాలి
తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె
కొంగులాగిన వేళ్ల కొలిమిలో పెట్టాలె
కన్నుగీటిన కళ్ల కారాలె చల్లాలె
తన్నిన కాళ్లను డాకరిగ వాడాలె
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె
కాలంబు రాగనె కాటేసి తీరాలె..
ఆనాటి నుండి ఈనాటి వరకు గొప్ప ప్రజాస్వామికవాదిగా, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్తగా కాళోజీ ఆంధ్ర ప్రజానీకానికి చిరపరిచితులు. ఏ కృషి జరిగినా అది వ్రష్టి కృషి మాత్రమే కాదు, సమిష్టి కృషి అని చిత్తశుద్ధితో, నిజాయితీతో నమ్మినవాడు కాళోజి.
ఆయన మాటల్లోనే- తిరుగుబాటు చేసినవాడు, దౌర్జన్యాలను ఎదుర్కోడానికి ప్రయత్నించినవాడు- ప్రతి నరుడు నరసింహుడే. తిరుగుబాటే బతుకు అయిపోయే పరిస్థితి ఏర్పడటానికి బాధ్యత సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఈ క్రింది కవితా పంక్తులతో కాళోజీ తన ఆత్మకథను సశేషంగా ముగించారు.
అన్యాయానె్నదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయానె్నదిరించిన వాడే నాకారాధ్యుడు
కనుకనే ఈ ఆత్మకథకు మనిషి కథ అనే ముందుమాట రాసిన వరవరరావు ఇలా అన్నారు. ఎవరైనా హనుమకొండకు పోతే అక్కడ ముఖ్యంగా చూడాల్సినవి రెండు-
1.వేయి స్తంభాల గుడి- అణగారిన శ్రమజీవులు సృష్టించిన కళాఖండం
2.కాళోజీ- అణగారిన శ్రమజీవులు నిర్మిస్తున్న పోరాట చరిత్రతోపాటు నడుస్తున్న బతుకంతా దేశానిదైన మనిషి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
అయపోయంది

కొత్తపల్లి రవిబాబు