వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరైతే కీర్తికండూతి ప్రబలి అనేక అయదార్థ విషయాలు వ్రాయడం కూడా కద్దు. కాని శ్రీపాదవారి రచనలో కొట్టవచ్చినట్టు కనిపించే అద్భుత లక్షణం సత్యనిష్ఠ. తాను చిన్నతనం నుంచి అనుభవించిన కష్టనిష్ఠురాలను, పడిన అవమానాలను, ఎదుర్కొన్న ఆకలి దారిద్య్రాది జీవిత సమస్యలను ఎక్కడా ఏమీ దాచలేదని ఒప్పించే రీతిలో చెప్పుకొచ్చారు. ఇందులో మరో మెచ్చదగిన అంశం నిర్భీతి. తమకు ఏవి ఇష్టమో వాటిని అమితంగా ఇష్టపడటం.. తమకు ఏవి గిట్టవో వాటిని అమితంగా ద్వేషించటం.. వాటిని ఏమీ దాచకుండా ప్రకటించడం వీరి విశిష్టలక్షణం. ఉదాహరణకు భారత జాతికంతటికీ పూజ్యుడుగా పరిగణించబడిన మహాత్మాగాంధీ అన్నా, ఆయన ప్రవచించిన ఆర్థిక సూత్రాలన్నా, ఆయన ప్రచారం చేసిన చరఖా ఖద్దరు అన్నా శ్రీపాదవారికి బొత్తిగా గిట్టదు. ఆ విషయం ఇతరులైతే ‘ఒకరిని నొప్పించడం ఎందుకులెమ్మ’ని చెప్పకుండా దాటవేస్తారు. కాని శ్రీపాదవారి జన్మ లక్షణమే అది కాదు. పైవిషయాన్ని గట్టిగా చెప్పడానికి ఆయన వెనుకాడలేదు. కొన్ని పట్టులలో ఆయన వ్యాఖ్యలు కొందరి దృష్టిలో అహంకారపూరితాలు అనిపించవచ్చు. ఆయనది సంకుచిత దృష్టి అనిన్నీ అనిపించవచ్చు. ఉదాహరణకు ‘‘నా దృష్టిలో తెలుగుదేశమే దేశం, తెలుగు భాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం’’ ఇత్యాది వ్యాఖ్యలు కొందరి నోటి వెంట దురహంకార దోషితాలనిపించవచ్చు కాని శ్రీపాదవారి కలం నుండి వెలువడినప్పుడు వాటిలో ఆత్మవిశ్వాసమే ధ్వనిస్తుంది.
ఈ రచనలో సర్వే సర్వత్రా ఆయన విశిష్ట వ్యక్తిత్వం అవ్యక్తవౌతూ వుంటుంది. బాల్యమాదిగా మరణ పర్యంతం ఆయన తనకిష్టంలేని పని- అది ఎంత లాభసాటిదైనా ఎంత పెద్దలు చెప్పినా చేయడానికి ఇచ్చగించకపోవడం కనబడుతుంది. మామూలు మానవులు జీవితంలో అనేక సందర్భాలలో అనేక కారణాల చేత ఒత్తిడులకు, ప్రలోభాలకు లోనవుతూ వుంటారు. అటువంటి సందర్భాలు ప్రతివారి జీవితాలలోనూ తప్పవు. కాని వాటికి లోబడనివారే అదృష్టవంతులు. వారిలో శ్రీపాద వారొకరు.

ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య