వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల వ్యవధిలో 780 పేజీలు, 65 భాగాలుగా వెలువడ్డాయి. 1958 నుండి ధారావాహిక పత్రికల్లో వచ్చాయి. సమకాలీన సంస్కృతికి - సాహిత్యానికి కళలకు.. అన్నింటికీ ఒకే మాధ్యమమైన ఆకాశవాణికి దర్పణమై నాటి తెలుగుతనపు మహోన్నత ఇంద్రచాపాన్ని, ఉజ్వల వర్ణాలతో ప్రతిబింబిస్తుంది.
20వ శతాబ్దపు సాహితీ సంస్కృతుల గతిని నిర్దేశించిన ఉద్దండుల సరసన మనమూ ఉంటాం. ఆగ్రా, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, తిరుచ్చి, మద్రాసు, బెంగుళూరు, విజయనగరం, విశాఖ, పర్లాకిమిడి, విజయవాడ, అమలాపురం, కాకినాడ, వౌంట్ అబూ, మధుర- శ్రీరంగం- దేశమంతా కలిసే పయనిస్తాం. రైల్వే, కారులో, గుఱ్ఱపు సార్స్‌లో.. రకరకాలుగా.
ఈ కథనం యావత్తూ గుర్తుచేసుకుని రాసిందే. శ్రీ జానకిరాం జ్ఞాపకశక్తికి మనం అబ్బురపడతాం. నాలుగేళ్ల వయసులో సంభవించిన మాతృవియోగం- పెరుగుతున్న కొద్దీ పరిణమించే వియోగ వ్యధ- వ్యధ మిగిల్చిన శూన్యం. ఆ శూన్యాన్ని నింపుకునే ఆరాటంలో పలికే ప్రతి పలుకూ మన చేతిలో చెయ్యి వేసి చెప్తున్నట్టుంటుంది. ఇది ఆత్మ చరిత్ర కాదు. ఆత్మకథ- అందువల్ల ఇందు సత్యంతోపాటు కొంత ఊహకూడా ఉంటుంది. అక్కడక్కడ ఈ ఊహ ఓ పాలు ఎక్కువగా ఉంటుందేమో కూడా ఆ సందర్భాన్ని బట్టి. కాని, ప్రధాన సంఘటనలు మాత్రం అక్షరాల జరిగినవే అని స్మృతిపథంలో మొదటే జానకిరాం స్పష్టం చేస్తారు.
కాలక్రమంలో బొత్తిగా సంబంధంలేని సంఘటనల సుదీర్ఘ సుమమాలికలా ఉంటుంది మొత్తం రచన. ఫిబ్రవరి 1958లో చలం జానకిరామ్‌కు శ్రీరమణాశ్రమం నుండి రాసిన ఉత్తరంలో ‘‘మీరు ఏవో రెమినిసెన్సులు వ్రాస్తున్నారని, దాంట్లో చాలాచోట్ల నా సంగతి రాస్తున్నారని, చదివిన నా మిత్రులు కొన్ని కొటేషన్స్ పంపారు. వాటిని చూసి ఎంతో బాగా వ్రాస్తున్నారనుకొన్నాను. మీ కలెక్షన్స్ అన్నీ అట్లానే వుంటే ఆ గ్రంథం చాలా విలువైనది అవుతుందనుకున్నాను.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290