వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాంటో ఛారమ్ ఏమిటంటే మీ అనుభవాన్ని ఎంతో భద్రంగా, ఇనే్నళ్లు- ఆప్టర్ ఈవెంట్సువల్ల ఇన్‌ఫ్లూయెన్సు కాకుండా ఐసోలేట్ చేసి, స్టెరిలైజ్ చేసి దాచి వుంచి ఈనాడు ప్రొడ్యూస్ చేయడం. ఇనే్నళ్ల తర్వాత, ఇప్పటి జానకిరామ్ కాక, ఆనాటి జానకిరామ్ ఆనాడే వీటిని రాసిపెట్టుకున్నాడా అనిపించింది. ఆ ఒక్క గుణం చాలు. అట్లాంటి రాతల్ని ప్యూర్ ఆర్ట్‌గా మార్చడానికి!’’ అంటారు.
1918లో జానకిరాం స్నేహితులతో తన పదహారో ఏట అరవిందులను దర్శించారు. ‘‘ఎప్పటికైనా భారత స్వాతంత్య్రమే లభిస్తే ఆ తరువాత మనం దేనికోసం పాటుపడదాం’’ అని అడిగారు.
ఈ స్వాతంత్య్రం ఒక సాధనం మాత్రమే. మనకు కావలసినది ఇంతకంటే ఇంకా గొప్పది. ప్రపంచానికంతా వెలుగు చూపించవలసిన బాధ్యత మన దేశానిది. స్వతంత్రులమైతే గాని ఆపని చేయలేము మనం. స్వాతంత్య్రం వచ్చాకనే మన అసలు పని ప్రారంభమవుతుంది అని అరవిందుల సమాధానం చెప్పారు.
జీవనగంగా హరిత తటంబున
చింతా పట తరువమూలమునన్
ఏల యధోముఖివై గడతెంచెద
వివ్విధి వన నిశలన్?
అవ్వలిగట్టున స్వప్నపురంబున
అవ్యయ నిర్వృలి వనులన్
డోలాఖేలన రతుడౌ ప్రియుని గ
డుంగడు భవాన సల్పెదవో
దువ్వూరి రామిరెడ్డి గేయంలో అవ్వలిగట్టు, స్వప్న పురం, చింతా వటతరుమూలం, అన్యయ నిర్వృతి పనులు, డోలాఖేలన రుతుడౌప్రియుడు జానకిరాంను ఆకర్షించాయి. నిలిచిపోయాయి. జానకిరాంలో భాగమయ్యాయి.
జానకిరాం, సుప్రసిద్ధ వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారబ్బాయి. (1880-1962) ఆంధ్రదేశంలో, మద్రాస్, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులుగా ఆచంట లక్ష్మీపతిగారు విశేష ఖ్యాతి గడించారు. మద్రాసు రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిగా మన్ననలందిన రుక్మిణీదేవి లక్ష్మీపతిగారి అర్ధాంగి. జానకిరాం పినతల్లి. నాటి సమాజంలో వారికున్న స్థానం- ప్రతిభ, సౌజన్యం కారణంగా ఆచంట వారి స్నేహలత దేశం నలుమూలలకు పాకింది. ఓ చలవ పందిరి వెలసింది. తండ్రీ తనయుల బంధమూ మైత్రీ బంధమే. ఎవరి ప్రతిభ వారిదే. ఆంధ్రుల చరిత్రలో ఎవరి స్థానం వారిదే.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు