వినమరుగైన

మగువ మాంచాల -ఏటుకూరి వేంకట నరసయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు సంశయాత్మా వినశ్యతి అన్నారు. కానీ అల్పులు మాత్రమే సందేహాలతో బాధపడతారు. ధీరులు స్థిరాభిప్రాయంతో ఉంటారు. ఒకరిని కోస్తే పాలు మరియొకరిని కోస్తే రక్తం వస్తుందా? అంటూ ఈ విభేదాలన్నీ మానవ కల్పితాలనే విషయం ధ్వనింపజేశారు.
ఆ సమయంలో బాలచంద్రుడు ఆర్యరక్తమితని దవ్వగారు అంటారు. ఇందులో ఎంత హేళన- ఎత్తిపొడుపు ఉన్నాయో విజ్ఞులకు తెలియందికాదు.
మంజీర ద్విపద అచ్చతెలుగు ఛందం- ఆంధ్రదేశంలో జరిగిన ఈ కథ చెప్పే వేళ రుూ కవి, ఈ ఛందాన్ని ఎక్కువగా వాడటం ఔచిత్య శోభితం.
బాలచంద్రుడు రణసన్నద్ధుడౌతున్నాడు. ఐతాంబ ఎన్నో నోములు నోచి, వ్రతాలాచరించి కన్న ఏకైక పుత్రుడు, బాలుడు కదనరంగానికి వెళ్లటానికి ఆమెకిష్టం లేదు. ఎన్నో విధాలుగా అతని సంకల్పం మరల్చటానికి ప్రయత్నించింది. కాని ఆమె యత్నాలు ఫలించలేదు. కనీసం కోడలు మాంచాలతో చెప్పించి కుమారుని నిల్వరించాలని తలపోసింది. నేరుగా కోడలింటికి వెళ్లింది. ఆమె సాయమర్దించింది. మాంచాల బాలచంద్రుల వివాహం జరిగి ఏడు సంవత్సరాలైంది. కాని ఒక్కసారైనా అతడు మాంచాల దగ్గరకు పోలేదు. కొడుకు నిత్యం వేశ్యాగృహానికి పోతుంటే సమర్థులైన అత్తమామలు కుమారుని వారించలేదనే వ్యధ మాంచాల గుండెల్లో గూడుకట్టుకొని ఉంది. ఆ సమయంలో వారి సంభాషణ ఎత్తిపొడుపులతో, హేళనలతో ఎంతో స్వతోరమ్యంగా సాగుతుంది.
ఐతమ్మ- తన కొడుకును ఎలాగైనా యుద్ధానికి పోకుండా ఆపమని కోడలినర్థిస్తుంది. అపుడు మాంచాల
చెడుపంచ త్రొక్కు భర్తల
కెడబాసిన మందభాగ్య లేడువవచ్చున్
పుడమి తలక్రిందొనర్చెడు
కొడుకుల గను తల్లులేల కుందగవలయున్? అంటుంది.
ఆ మాటలు కశాఘాతాలుగా ఐతమ్మ గుండెకు సోకాయి. అందులోని వ్యంగ్యమర్థమైంది. ఇక కోడలికి చెప్పి ప్రయోజనం లేదు. ఎలాగైనా బ్రతిమాలి బామాలి కార్యం సాధించుకోవాలి అని భావించి
‘‘అమ్మవుగా- బంగారపు- బొమ్మవుగా కొడుకుననికిబోనీకమ్మా’
అంటుంది. ఇందులో తెలుగు పలుకుబడి రసమోడుతుంది. మంచాల
‘‘నీయడియాసగా కసలు నీకొడుకేమిటి? బొల్లసానిస
బ్బాయిని బాయుటేమి? యిటువంటి యదృష్టము గూడనబ్బునా?
ప్రాయమునం జెమర్చురసభావ పరీమళమంత సాని స
బ్బాయిద? నేటికా చరమ భాగమలీమ సమంతనా యదా?’’ అంటుంది.
‘‘అత్తా! నీ ఆశ కాక నీ కొడుకేమిటి- సానిసబ్బాయిని వదలి యుద్ధానికి పోవటమేమిటి? అయ్యో! అంత అదృష్టం కూడానా? ఐనా వన కాల సౌఖ్య రసానభవమంతా సానిదా? చివరకి మిగిలిన పిప్పి నాదా?’’ అని ప్రారంభిస్తుంది. ఒక్కొక్కమాట ఒక అలుసు పోటుతో ధీటుగా ఉంటుంది.
బాలచంద్రుడు మాంచాల మందిరానికి వచ్చాడు. మాంచాల రూప రేఖా విలాస విభ్రమ లావణ్య సౌకుమార్యాదులను చూచి పరవశించాడు. మంచాల చిరునవ్వుతో వచ్చింది. అతని కుడికాలు మాత్రం కడిగింది.
‘‘మాంచాల సరికొత్త మర్యాదలేమి
గండు వారాచార కాండ కాబోలు’’
అని ప్రశ్నించాడు. మాంచాల గండువారింటిలో పుట్టింది. అందుకే ఆ పరిహాసం.
‘‘పలనాటి వీరులు తెలియకన్నారె?
సాని సబ్బాయిదా చరణంబు కాద!’’
అని ఎగతాళిగా సమాధానం చెప్పింది. బాలచంద్రుని శరీరంమీద చెరణాకోలు చెళ్లున్నట్లైంది. నిరుత్తరుడైనాడు. ఆమె కుడిపైట వేసికొని ఉంది. అతని కవకాశం దొరికింది.
‘‘కోమలీ తగునటే కుడి పైట వేయ
శీలమవారి దాసికి కూడలేదె
అన్నాడు. వెంటనే ఆమె
‘‘గండువారింటిలో గాలిసైతమ్ము
కుడివైపుగా వీచు కోల్పోదు పటిమ’’
అంటే ఆలిని విడిచి వెలయాలితో తిరిగేవాడు మా వంశంలో లేరని ధ్వనింపజేసింది.
ఆమె సౌందర్యాన్ని ప్రశంసిస్తూ బాలచంద్రుడు
‘‘నీవు పుష్పమైతే నే తుమ్మెదనౌతాను.
నీవు కోకిలవైతే నేను మధుమాసాన్ని ఔతాను
నీవు జలదరువైతే నేను సుధాకరుడనౌతా’’ నని ప్రారంభించాడు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

--మొవ్వ వృషాద్రిపతి